చంద్రబాబునాయుడుకు సీనియర్ నేత, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పెద్ద షాకే ఇచ్చాడు. విశాఖపట్నం విమానాశ్రయంలో  జనాల మధ్య చంద్రబాబు దాదాపు ఏడుగంటల పాటు ఇరుక్కుపోయినా గంటా మాత్రం అడ్రస్ లేడు. చంద్రబాబు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే బయటకు రావటానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.  ఎంత ప్రయత్నం చేసినా సాయంత్రం 6 గంటల దాకా విమానాశ్రయం దాటి బయటకు రాలేక చివరకు హైదరాబాద్ కు తిరిగి వెళ్ళిపోయారు.

 

విమానాశ్రయం దగ్గర జరిగిన హై ఓల్టేజ్ డ్రామాను గంటల పాటు రాష్ట్రమంతా చూసింది. అయితే ఇంత జరిగినా విశాఖలోనే ఉన్న గంటా మాత్రం ఎక్కడా అడ్రస్ లేదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రోజు నుండి చంద్రబాబు ఏ స్ధాయిలో వ్యతిరేకిస్తున్నాడో అందరూ చూస్తున్నదే.  ఎయిర్ పోర్టులో వాతావరణం ఇంత సీరియస్ గా ఉన్నా గంటా మాత్రం కనబడలేదు.  

 

ఇక్కడే టిడిపి నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. ఒక్కోసారి గంటా ఒక్కోలాగ ప్రవర్తిస్తున్నారు. ఒక రోజేమో పార్టీలో చాలా ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తారు. ఇంకో రోజేమో అసలు పార్టీలో ఉంటారో ఉండరా అనే అనుమానం వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్దితుల్లో జగన్ చేసిన ప్రతిపాదనను గంటా స్వాగతించటం పార్టీలో పెద్ద సంచలనంగా మారింది. ఇదే విషయమై గంటా వైఖరిపై పెద్ద చర్చే జరిగింది. జగన్ పై జనాలను రెచ్చగొట్టడానికి చివరకు చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు కూడా ప్రారంభించారు.

 

ఈ నేపధ్యంలోనే జగన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు.  మొదటిరోజు  విశాఖపట్నం మరుసటి రోజు విజయనగరం జిల్లా పర్యటన కోసం విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. తాను ఎలాగూ విశాఖకు వస్తున్నాను కాబట్టి అందరూ తప్పకుండా వస్తారనే అనుకున్నారు. ఎలాగూ సీనియర్లందరూ వస్తారు కాబట్టి గంటా కూడా వస్తాడనే అనుకున్నారు. ఎందుకంటే జిల్లాలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో నలుగురూ సిటి నుండే గెలిచారు. అయితే చంద్రబాబు ఒకటనుకుంటే జరిగింది మరకొటి. మొత్తానికి చంద్రబాబుకే కాదు మొత్తం పార్టీకే గంటా షాక్ ఇచ్చాడనే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: