రాళ్లు రువ్వడం...కర్రలతో దాడులు చేయడం.. పెట్రోల్ బాంబులు వేసుకోవడం.. సాధారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగితే ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. కానీ ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో తుపాకులు పేలాయి..! బుల్లెట్లు దిగాయి..! ఢిల్లీ విధ్వంసంలో చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది కాల్పుల వల్లే ప్రాణాలు కోల్పోయారు..! రెండు మతాల మధ్య జరిగిన ఘర్షణలో గన్స్‌ను ఉపయోగించడం దేశంలోనే ఇదే తొలిసారి..! మరి అల్లరి మూకల చేతికి గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరు సరఫరా చేశారు...?

 

ఓ వ్యక్తి పోలీసుల సమక్షంలోనే చేతిలో తుపాకీతో వీరంగం సృష్టించాడు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు...  ఆ దృశ్యాలు మీడియా కెమెరాకు కూడా చిక్కాయి.  ఓ చట్టానికి వ్యతిరేకంగానో...అనుకూలంగానో  ఆందోళన జరుగుతున్న ప్రాంతంలోకి చొరబడ్డ వ్యక్తుల చేతిలోకి తుపాకి ఎక్కడి నుంచి వచ్చింది...? ఇతడొక్కడేనా... లేక విధ్వంసకారులంతా  గన్స్ వాడారా...?? 

 

ఢిల్లీ ఘర్షణల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది బుల్లెట్ గాయాలతోనే చనిపోయారు.... తుపాకీ కాల్పుల్లోనే ప్రాణాలు కోల్పోయారు...  ఈశాన్య ఢిల్లీ ఘర్షణల్లో 300 మందికి పైగా గాయ పడితే వారిలో 80 శాతం మందికి బుల్లెట్ గాయాలున్నాయటే...అల్లరి మూకలంతా గన్స్ ఉపయోగించినట్టే... తుపాకులతో చెలరేగిపోబట్టే... ఇంతమంది చనిపోయారు.

 

ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ఏరియాల నుంచి పోలీసులు 500లకు పైగా ఖాళీ గన్‌ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాయింట్ 32, 9 ఎంఎం, పాయింట్ 315 పిస్టల్స్‌కు సంబంధించినవే ఇవన్నీ. ఆందోళనకారుల చేతికి ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? కంట్రీ మేడ్ పిస్టల్స్‌ ఈశాన్య ఢిల్లీ వరకు ఎలా చేరాయి...? ఘర్షణలో పాల్గొన్న వారంతా ఎక్కడి నుంచి వచ్చారు...? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి.

 

ఉత్తరప్రదేశ్, బీహార్‌ నుంచి వలస వచ్చిన లోకల్‌ గ్యాంగ్స్ వద్ద పెద్ద ఎత్తున  దేశీయ తయారీ తుపాకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈశాన్య ఢిల్లీ ఘర్షణల్లో పాల్గొన్న వాళ్లు కూడా సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇంత పెద్ద ఎత్తున తుపాకులను వాడటం దేశంలోనే ఇది తొలిసారి అంటున్నారు పోలీసులు.  ఈశాన్య ఢిల్లీలో చిన్న చిన్న ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కూడా రాళ్లు, కర్రల కంటే గన్స్ వాడకమే ఎక్కువ ఉందని.. పోలీసులు చెబుతున్నారు.

 

ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటున్న ఈశాన్య ఢిల్లీలో క్రైమ్‌ రేట్ చాలా ఎక్కువ. బోర్డర్ ఏరియాలో తిష్టవేసిన రౌడీ మూకలు ఇక్కడ నిత్యం అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటాయి.. దోపిడీలు, దొమ్మిడీలు, మాదక ద్రవ్యాల వాడకం, తుపాకులతో అలజడి సృష్టించడం.. ఇక్కడ సర్వసాధారణం...ఈ ప్రాంతాల్లో FIRల నమోదు కూడా చాలా ఎక్కువ.  ఉత్తర, ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి అక్రమ మార్గాల తర్వాత  ఆయుధాలు వీళ్లకు చేరుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో గన్స్‌కు ఎక్కువ డిమాండ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ మార్గాల్లో వందలాది మంది తుపాకులు తెచ్చుకుంటున్నారు...భద్రత కోసం చట్టబద్దంగా గన్స్‌ను కలిగి ఉండేవారి కంటే... సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి దగ్గరే ఆయుధాలు ఎక్కువగా ఉంటున్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: