ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతుంటాయి. నవ్విన నాప చేనే పండుతుంది అని కూడా అంటారు. అలాంటిదే ఈ సంఘటన.. విశాఖ పర్యటనలో తనను అడ్డుకున్నందుకు చంద్రబాబు వైసీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖను రాజధానిగా వద్దన్నందుకే జనం అడ్డుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు హిస్టరీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు.

 

 

ఈ విషయంపై మాట్లాడిన వైసీపీ నేత దాడి వీరభద్రరావు.. చంద్రబాబుకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ విషయాన్ని బయటపెట్టారు. “ 1994లో చంద్రబాబు చేసిన పనేంటి. ఎన్టీఆర్‌ వైశ్రాయ్‌ హోటల్‌కు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావుపై టమాటాలు, చెప్పులు, కోడిగుడ్లు విసిరించింది మీరు కాదా చంద్రబాబూ..? విశాఖలో మీపై విసిరిన ఒక్క చెప్పును చూపించలేకపోయారు. కానీ, వైశ్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పుల కుప్పలు కనిపించాయి. నేను ప్రత్యక్ష సాక్షిని.. అంటూ చంద్రబాబును కడిగి పారేశారు.

 

 

టీడీపీ పార్టీని స్థాపించి చంద్రబాబుకు చోటు కల్పించి.. గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్‌ని అవమానించిన విషయం ప్రజలు మర్చిపోయారనుకుంటారా ..? చంద్రబాబు నీకు సిగ్గులేదా..? ఎన్టీఆర్‌ అసెంబ్లీకి వస్తే రూల్స్‌ను పక్కనబెట్టి ఆయన్ను మాట్లాడకుండా చేసింది మర్చిపోయారా..? మొదటిసారి ఎన్టీఆర్‌ కళ్లలో నీరు చూశాను. ఎన్టీఆర్‌ను అవమానిస్తుంటే చంద్రబాబు రాక్షసానందం పొందాడు.. అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు దాడి వీరభద్ర రావు.



ఇప్పుడు.. విశాఖలో తనకు అన్యాయం జరిగిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి ఏనాడూ చూడలేదని బీరాలు పలుకుతున్నాడు.. డాల్ఫిన్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌ వెన్నుపోటుకు కుట్ర రచించిన చంద్రబాబు దాన్ని వైశ్రాయ్‌ హోటల్‌లో అమలు చేశాడు. మామ అనే కనీస గౌరవం కూడా లేకుండా ఆయన చనిపోయిన తరువాత కూడా కక్ష తీర్చుకున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్‌ మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తే ఆనాటి పోలీస్‌ కమిషనర్‌ అప్పారావును పిలిచి ప్రజలు ఉండేందుకు వీల్లేదు.. రామారావును చూసేందుకు ఎవరూ రాలేదని అనుకోవాలని లాఠీచార్జ్‌ కూడా చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.. అంటూ చంద్రబాబు గతం గుర్తు చేశారు దాడి వీరభద్రరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: