కరోనా వైరస్ ...ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణ భయంతో గజగజ వణికిపోతోంది . ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ ప్రమాదకరమైన వైరస్ ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా  వైరస్ మాత్రం రోజురోజుకూ ఎక్కువ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే చైనా దేశం మొత్తం స్వీయ దిగ్బంధం లోకి వెళ్ళిపోయింది. చైనా దేశం నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లడం లేదు. రోజురోజుకు కరోనా మరణాలు కూడా పెరిగిపోతూ వస్తోన్నాయి. ముఖ్యంగా చైనాలోని కొన్ని నగరాలలో అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 

 

 

 చైనా తో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఎన్నో దేశాలు ఈ ప్రాణాంతక వైరస్ పేరు ఎత్తితేనె  భయపడుతున్నాయి. అయితే రోజురోజుకు ఎంత మంది చనిపోతున్నారు.. ఎంతమందికి కొత్త గా వైరస్ వ్యాపిస్తుంది అని చైనా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ చైనా ప్రభుత్వం,.. చెప్పిన లెక్కల కంటే అసలు లెక్కలు భారీగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరు. అయితే ప్రస్తుతం ఏకంగా 82 వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్న వారు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 2,800 మంది చనిపోయారు.

 

 

 అయితే చైనా ప్రభుత్వం వైద్యులు ఈ వైరస్ ను  తగ్గించాలని చూస్తున్నా రోజురోజుకు బాధితుల సంఖ్య మాత్రం పెరిగిపోతున్నది.  దీనికి కారణం అక్కడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం. ఈ క్రమంలో కరోనా  వైరస్ బాధితులను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త ప్లాన్ వేసింది. కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న వారు స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకొచ్చి చెకప్ చేయించుకొని..వారికీ కరోనా  ఉన్నట్లు రుజువు అయితే ఏకంగా పది వేల యువాన్లు  ఇస్తామని ప్రకటించింది చైనా ప్రభుత్వం. కరోనా లక్షణాలున్న వారు స్వయంగా పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపాలి అనే ఉద్దేశంతో ఈ రివార్డును  ప్రకటించినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: