రోజురోజుకు మహిళలకు రక్షణ కరువవుతోంది... దీంతో మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. కఠిన చట్టాలు తీసుకొచ్చినా పోకిరీలు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది కామాంధుల  బారినపడి అత్యాచారాలకు గురై  తనువు చాలిస్తే కొంతమంది అవమానలు భరించలేక తనువు చాలిస్తున్నారు. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి సంఘటన ఎదురైంది. ఆ యువతికి అమ్మానాన్న ఎవరు లేరు ఒంటరి గా ఉంటూనే ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్. కానీ ఆమెను  మాత్రం పెద్దగా పట్టించుకోడు. దీంతో ఆమెకు ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోడానికి ఎవరూ లేరు. ఈ క్రమంలోనే కొందరు పోకిరీలు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఇక వాళ్ల వేధింపులు తట్టుకోలేక పోయిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కన్నీళ్లు పెట్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... సూరారం డివిజన్ నెహ్రూ నగర్ కు చెందిన తులసి అనే యువతి... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది . దీంతో అమ్మమ్మ కోమలి బాయి వద్దనే ఉంటూ సమీపంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది తులసి. అయితే గత కొంతకాలంగా తులసి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే  ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో చదువు డిస్టర్బ్ కాకూడదు అనే ఉద్దేశంతో.. తులసి ప్రేమించిన యువకుడు తనతో  మాట్లాడటం మానేసి కాస్త దూరం పెట్టాడు. ఇదిలా ఉంటే తులసి రోజు కాలేజీకి వెళ్లి వస్తున్న సమయంలో...ఆమెను  కొంతమంది పోకిరీలు ఏడిపించడం మొదలుపెట్టారు. ఇక రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇక ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తులసికి  అర్థం కాలేదు.. దీంతో తాను ఒంటరిదాన్ని అనే బాధతో మనస్తాపానికి గురైంది. 

 

 

ఏకంగా మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి... ఉరివేసుకొని తనువు చాలించింది ఆ యువతి. తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని... కానీ తన స్నేహితులకు తన బాధలు అని చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది తులసి. తులసి ఫ్యాన్కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించడం చూసి అమ్మమ్మ బోరున విలపించింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: