లీఫ్ ఇయర్ గురించి అందరు వినేవుంటారు. అయితే దాని ప్రత్యేకత ఎంతమందికి తెలుసు? మనలో చాలామందికి ఈ ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. ఈసారి ఫిబ్రవరిలో 29 రోజులు వున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే మామ్మూలుగా ఈ ఎక్స్‌ట్రా డే, ఫిబ్రవరిలోనే ఎందుకొస్తుంది? ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుందని మనం చిన్నప్పుడే చదువుకున్నాం. ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి.

 

IHG

 

సహజంగా, ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. అదే లీఫ్ ఇయర్ లో మాత్రం, ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా యాడ్ అవుతుంది. ఎందుకిలా జారుతుందంటే, మనకు బాగా తెలుసు.. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని! ఒక్కసారి అలా తిరిగి రావడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది అని కూడా మనలో చాలామందికి తెలుసు కదా. ఒకరకంగా చెప్పాలంటే, 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కనుక, ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావుల్ని కలిపి, ఒక రోజుగా చేసి లీఫ్ ఇయర్‌లో, ఫిబ్రవరి నెలలో, అదనపు రోజును చేర్చుతున్నారు!

 

అయితే, ఆ ప్రత్యేకమైన రోజుని ఫిబ్రవరిలోనే ఎందుకు కలుపుతున్నారు అంటే, క్రీ.పూ గ్రీకులు, రోమన్‌లు కేలండర్‌లో.. రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. ఉదాహరణకు రోం చక్రవర్తి జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి, రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. అతను ఎంటరయ్యాక, కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చిందన్నమాట!

 

IHG

 

జూలియస్ కాసర్ అనంతరం, కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని అతను ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. ఇదన్నమాట అసలు విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: