తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను తీర్చడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూనే ఎవరికి అవసరం ఉందో వంటి ప్రజలపై దృష్టి పెట్టి మరి వేదికపై పిలిచి వాళ్ల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం కెసిఆర్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగానే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో ఓ శుభకార్యానికి వెళుతున్న సందర్భంలో కాన్వాయ్ వెంటనే ఆపేసి రోడ్డు పక్కన వ్యక్తి దగ్గరికి వెళ్లి చేసిన కేసీఆర్‌ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది. విషయంలోకి వెళితే హైదరాబాద్‌ టోలీచౌకి ప్రాంతంలో రోడ్డుపై సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా సడన్ గా ఆగిపోయింది.

 

దీంతో కేసీఆర్‌ వెంట నడుస్తున్న కాన్వాయ్ వాహనాలు కూడా ఆగి పోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న అధికారులు మరియు పోలీసులు ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోయారు. ఇంతలో కారులో ఉన్న కేసీఆర్‌ ఒక్కసారిగా దిగి రోడ్డు పక్కన నిలబడి ఉన్నా ఓ వృద్ధ దివ్యాంగుడి దగ్గరకు వెళ్లారు. ఏం పెద్దాయన.. చేతిలో వినతిపత్రం ఏంటంటూ ఆప్యాయంగా పలకరించారు. అతని పేరు సలీం.

 

ఈ సందర్భంగా సలీం కేసీఆర్‌ కి తన బాధని చెప్పుకున్నాడు. ‘నేను గతంలో డ్రైవర్‌గా పనిచేశా. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. నాలుగేళ్ల క్రితం భవనంపై నుంచి పడటంతో కాలు విరిగింది. నా కొడుకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఉండటానికి ఇళ్లు కూడా లేదు’ అని సీఎంతో మొరపెట్టుకున్నాడు. తనకు తగిన సాయం చేసి ఆదుకోవాలన్న సలీం విజ్ఞప్తిపై వెంటనే సీఎం కేసీఆర్‌ స్పందించారు. దీంతో వెంట ఉన్న ప్రభుత్వ అధికారులకు చలం కి దివ్యాంగుల పెన్షన్, మరియు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్...తండ్రి చేసిన పని తెలుసుకొని  హగ్ చేసుకున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: