తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో  ముందుంటారు. సభా వేదిక ఏదైనా తనదైన ప్రసంగాలతో ఎప్పుడు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ విజయ పరంపర కొనసాగిస్తున్న సమయంలో కూడా ఏకంగా  మల్కాజిగిరి ఎంపీ స్థానం  గెలిచి తన సత్తా ఏంటో చూపించారు రేవంత్ రెడ్డి. అయితే తాజాగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉంది అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తనకు 2+2 భద్రత కల్పిస్తున్నారని దానిని 4+ 4 భద్రతకు మార్చాలంటూ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ లో హైకోర్టును కోరారు. తన భద్రత పెంపు కు సంబంధించి పలు కీలక కారణాలను తెలిపారు ఎంపీ రేవంత్ రెడ్డి. 

 

 

 తను 2007 సంవత్సరం నుంచి ప్రజా  ప్రతినిధి గా ఉంటూ ఉమ్మడి రాష్ట్రంతో  పాటు తెలంగాణ రాష్ట్రం లోనూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే అంశాలపై పోరాటం చేస్తూ ఉన్నాను అని తెలిపిన రేవంత్ రెడ్డి... 2009 ఎన్నికల సందర్భంగా తనపై దాడి జరగడంతో... 4+4 భద్రత కల్పించిందని...కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం తన భద్రతను 2+2 కి  తగ్గించాలంటూ రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వైరం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి... కెసిఆర్ ప్రభుత్వానికి తాను నిరంతరం వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని తెలిపారు. 

 

 

 తెలంగాణ ప్రభుత్వం తనపై ఎంతో కక్ష  కట్టింది అని తెలిపిన రేవంత్ రెడ్డి.. కెసిఆర్ సర్కార్ తనను అంతమొందించాలని చూస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రామేశ్వరరావు కూడా నాపై పలు కేసులు వేశారు అంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే తన భద్రత పెంచాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు. దీనికి సంబంధించి గతంలోనే హోంశాఖకు భద్రతా కోసం  లేఖ రాశానని... దానిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో నే హైకోర్టును ఆశ్రయించిన తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రామేశ్వరం నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతను పెంచాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: