వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలలో చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. చాలావరకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారులకు చేకూరేలా జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక్క పథకాలు విషయంలోనే కాదు కొత్త కొత్త ఉద్యోగాల విషయంలో మరియు విద్యా వ్యవస్థలో కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న విద్యా విధానం బయట వచ్చే ఉద్యోగాల పొందే విధానం చాలా భిన్నంగా ఉందని ప్రతిపక్షంలో జగన్ పేర్కొనటం జరిగింది. విద్యార్థి కాలేజీలో చదివే విద్యా విధానం బయటికి వచ్చాక జాబు పొందే విధానం పూర్తిగా మారిపోతుంది...ఉద్యోగానికి చదివిన చదువుకి సంబంధం లేనట్టుగా ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఉందని ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో కామెంట్లు చేయడం జరిగింది.

 

అయితే తాజాగా సీఎంగా జగన్ ఉండటంతో రాష్ట్రంలో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యావిధానంలో కొత్త మార్పులు తీసుకురావడం కోసం జగన్ సర్కార్ చేసిన నిర్ణయానికి భారీ స్పీడ్ బ్రేకర్ వేసింది జాతీయ ఉన్నత సాంకేతిక విద్యా నియంత్రణల పర్యవేక్షణ సంస్థలు. విషయంలోకి వెళితే రాష్ట్రంలో రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల కాల వ్యవధిని మరో ఏడాది పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జాతీయ ఉన్నత, సాంకేతిక విద్యల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి.

 

జాతీయ విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశాయి. కోర్సుల కాల వ్యవధి ఎలా ఉండాలన్నది రాష్ట్రాలకు సూచిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశ పెట్టాలని భావించిన సీఎం జగన్‌ నిర్ణయానికి యూజీసీ, ఏఐసీటీఈలు 'అబ్బే కుదరదు - అస్సలు కుదరదు ' అంటూ బ్రేకులు వేసినట్టయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: