ప్రేమ ఎంతటి  మొనగాడి నైనా కూడా పిల్లిని చేస్తుంది అన్న విషయం తెలిసిందే.. అందుకే ప్రేమ కోసం చాలా మంది ప్రాణాలను కోల్పోతుంటారు. అయితే, ప్రేమ కోసం కొన్నీ రాజ్యాలను కూడా ఓడిస్తే, కొందరు ప్రాణాలను కూడా కోల్పోతుంటారు. వీతటిని మించి ఇప్పుడు చాలా మంది ప్రేమ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక్కడ మాత్రం కొంచం విచిత్రం అనే చెప్పాలి. 

 

 


వివరాల్లోకి వెళితే.. ఇంజనీరింగ్ కళాశాల లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రిన్స్ పాల్, సిబ్బంది ని బెదిరించాడు. కాలేజీ లో చదువు కుంటున్న ప్రియురాలి తో మాట్లాడేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రచ్చరచ్చ చేశాడు.. ఎట్టకేలకు యువకుడి ని అదుపులో కి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

 

 

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని కలిసేందుకు ఖమ్మంకు చెందిన ఉదయ్ కిరణ్ అనే యువకుడు వీరంగం చేసాడు. హైదరాబాద్ లో సిఎ చదువుతున్న సదరు యువకుడు తన ప్రేమించిన అమ్మాయి ని కలిసేందుకు ఓ ప్లాన్ వేసుకున్నాడు. అందుకోసం రా సంస్థ  కు చెందిన ఆఫీసర్ గా నకిలీ ఐడెంటి కార్డును తయారు చేసుకున్నాడు. దాంతో కార్డు చూపించి కాలేజీ లో ప్రవేశించిన యువకుడు ప్రిన్సిపల్ ని కలిశాడు. 

 

 


అయితే పరిశోధనలు చేయాలంటే .. తన ప్రేమిస్తున్న అమ్మాయిని బయటికి పంపించాలని కోరాడు. ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వకపోవటంతో నకిలీ ఐడీ కార్డు చూపించి వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.అతని మాటలు జంకుతుండటంతో అధ్యాపకులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నా పోలీసులు అతని వివరాలను కనిపెట్టారు.సి ఏ చదువుతున్న ఉదయ్ కిరణ్ గా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: