ప్రపంచాన్ని వణికిస్తున్న రోగం కరోనా వైరస్. చైనా దేశంలో ఈ మహమ్మారి వేల సంఖ్యలో బలిదానం తీసుకుంటుంది. చైనా దేశంలో వ్యూహన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు గజ గజా లాడిస్తుంది.  ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలా సోకే ఈ వైరస్ నుండి దేశ ప్రజలను రక్షించడానికి చైనా ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలను పూర్తిగా ఆపేసింది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా చైనా నుండి వచ్చే ఎగుమతులు దిగుమతులు విషయంలో రాకపోకల విషయంలో అనేక ముందుజాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో ఈ కరోనా వైరస్ నీ అడ్డం పెట్టుకుని కొంతమంది ఆకతాయిలు చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందని భయభ్రాంతులకు ఫేక్ న్యూస్ తెలంగాణలో భయంకరంగా ప్రచారం చేయడంతో తెలంగాణలో పౌల్ట్రీ ఫార్మ్ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతోంది.

 

దీంతో కరోనా వైరస్ కి మరియు చికెన్ కి ఎటువంటి సంబంధం లేదు అని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలోనే పౌల్ట్రీ రంగానికి కిరీటం లాంటిది హైదరాబాద్ నగరం అని పేర్కొన్నారు.

 

అలాంటి పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తెలంగాణలో సంక్షోభంలో ఉందని ఇది వాస్తవం అని పేర్కొన్నారు. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుంది వస్తున్న వార్తలను ఎవరు నమ్మవద్దని నేను మరియు ముఖ్యమంత్రి కేసీఆర్  చికెన్ తింటున్నామని గుడ్లు తింటున్నామని కుటుంబ సమేతంగా తింటున్నామని ధైర్యం చెప్పడానికి కేటీఆర్ కామెంట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ కలిగిన వాళ్ళు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నట్టే పరిశ్రమ రంగంలో కూడా ఉంటాయని తెలిపారు. ఇదే సందర్భంలో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొనడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: