కష్టపడేతత్వం, కృషి, పట్టుదల ఉంటే సాధించడంటూ ఏమి ఉండదని అందరు అంటుంటారు. ఇది అందరు చెప్పే మాటే అయినా చాలా మంది ఈ మాటను నిజం చేశారు. చాలా మంది వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. తిట్టినా నోర్లతోనే పొగిడించుకున్నవారు ఉన్నారు. కొట్టిన చేతితోనే చప్పట్లు కొట్టించుకున్నవారు ఉన్నారు. అలాంటి స్టోరీనే ఈ అందాల భామది.

 

లావుగా ఉన్నావంటూ వరుడు వదిలేశాడు. ఆమె రోడ్డుపై నడుస్తుంటే వెక్కిళ్లి నవ్వులు వినిపించేవి. ఎన్నో అవమానాలు, మరెన్నో చీదరింపులను ఎదుర్కొంది. దింతో ఆమెలో కసి పెరిగింది. దింతో ఆమె మిస్ గ్రేట్ బ్రిటన్ కిరీటం కైవసం చేసుకుంది. నూట పది కిలోల బరువు ఉన్న అమ్మాయి అందాల పోటీల్లో గెలవటం ఏంటి అనుకుంటున్నారా..?

 

బ్రిటన్ కి చెందిన జెన్ అట్కిన్ 26ఏళ్ళు. నూట పది కిలోల బరువు ఉండేది. వయస్సుకి మించిన శరీర ఆకృతితో నిత్యం బాధపడుతూనే ఉండేది. అయితే జెన్ అట్కిన్ కృషి, పట్టుదలతో రెండేళ్లలో యాభై కిలోల బరువు తగ్గింది. బొద్దుగుమ్మ కాస్త ముద్దు గుమ్ముగా మారింది. ఆండాళమ్మను తలపించిన జెన్ అట్కిన్ మెరుపు తీగల మారింది. జెన్ అట్కిన్ 2020లో అందాలలో పోటీలో పాల్గొని విన్నర్ గా నిలిచింది.

 

జెన్ అట్కిన్ మూడు సంవత్సరాల క్రితం నూట పది కిలోల బరువుతో చుడానికే ఇబ్బందిగా కనపడింది. డ్రెస్ లు సరిపోయేవి కాదు. ఆమె బరువు ఆమెకు మైనెస్ అయ్యింది. చివరకి పెళ్లి సంబంధాలు కూడా ఆగిపోయాయి. చివరకు ఒక్క సంబంధం ఆఖరి నిమిషంలో రద్దు అయ్యింది. ఆమె చాలా లావుగా ఉందని పెళ్ళికొడుకు ఆమెను వదిలేశాడు. దింతో జెన్ అట్కిన్ చాలా బాధపడింది. 

 

ఆమె తనను తాను నిందించుకుంటూ సైలెంట్ గా ఉండిపోలేదు. ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది.వెయిట్ లాస్ పై ఫోకస్ చేసింది. అది కూడా ఆరోగ్యకర పద్దతిలోనే బరువు తగ్గడానికి కృషి చేసింది. వ్యాయామం చేసింది. ఆమె కష్టానికి ఫలితం తగ్గింది. బరువు తగ్గడం స్టార్ట్ ఇది. అందాలలో పోటీలో పాల్గొని తన అందంతో జడ్జిలను మైమరిపించింది. ఈ రోజుకు వేగంగా ముందుకు సాగండి ఇప్పుడు సంతోషంగా వేరొకరిని వివాహం చేసుకున్న జెన్, మిస్ గ్రేట్ బ్రిటన్ కిరీటం పొందడం ద్వారా తన మాజీ ప్రియుడిపై అంతిమ ప్రతీకారం తీర్చుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: