మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి ని అభినందించారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం అనేక సార్లు అందరూ చూసిందే. అలాంటి పవన్ తాజాగా జగన్ అభినందిస్తున్నట్లు చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే కర్నూలులోని సుగాలి ప్రీతి హత్యాచారం కేసును సిబిఐకి అప్పగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు  జారీచేసింది.

 

ప్రీతి హత్యాచారం కేసును సిబిఐకి జగన్ అప్పగిస్తాడని నిజానికి పవన్ కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈమధ్యనే కర్నూలులో పర్యటించిన పవన్ మాట్లాడుతూ వెంటనే ప్రీతికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని మాత్రమే డిమాండ్ చేశారు. అలాంటిది మొన్ననే కర్నూలుకు వెళ్ళిన జగన్ ప్రీతి హత్యాచర ఉదంతంపై సిబిఐతో  దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పటం పవన్ ముందు ఆశ్చర్యపరిచింది. తర్వాత చేసేది లేక అభినందనలు తెలిపారు.

 

 అసలు వాస్తవాన్ని గమనిస్తే సుగాలి ప్రీతి హత్యాచార ఘటన చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు జరిగింది. అప్పట్లో  ఎంత గొడవ జరిగినా ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పట్లో చంద్రబాబుకు ఆప్తమిత్రుడిగా ఉన్న పవన్ కూడా కనీసం నోరెత్తలేదు. ఆ తర్వాత ఇదే కేసు విషయమై తల్లి, దండ్రులు ఎంత గోల చేసినా కూడా పవన్ అటువైపు కూడా తొంగి చూడలేదు. అలాంటిది చంద్రబాబు ఘోరంగా ఓడిపోయి జగన్ అధికారంలోకి రాగానే పవన్ కు హఠాత్తుగా సుగాలి ప్రీతిపై జరిగిన హత్యాచారం గుర్తుకొచ్చేసింది.

 

దాంతో పవన్ రెచ్చిపోయారు. అదేదో హత్యాచార ఘటనేదో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగినట్లు ఈ ఘటనతో అసలు చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధమే లేనట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరూ చూసిందే. దాంతో పవన్ కూడా ఊహించని విధంగా కేసును సిబిఐకి అప్పగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంతో ఏమి చేయాలో అర్ధంకాని పవన్ చివరకు జగన్ అభినందనలు తెలిపారు. పవన్ తాజా వైఖరితో టిడిపి నేతలకు షాక్ తగిలినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: