మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలకు ఏ చిన్న సమస్య ఉన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మ కొడుతూ ఉంటారు. కొంతమంది వేరే పనులు ఉన్నాయ్ అని  అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉంటారు. ఇలా చాలా మటుకు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో  కనిపించారు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది అంటే అసలు అసెంబ్లీ సమావేశం వైపు తిరిగి కూడా చూడరు ఎమ్మెల్యేలు . కానీ ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యే మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె రాకూడని పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల హాజరయ్యేందుకు వచ్చి  అందరికీ ఆదర్శం గా మారింది. నిండు గర్భిణిగా ఉన్న కూడా ఆ మహిళా ఎమ్మెల్యే  అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చింది. 

 

 

 నిండు గర్భిణి అయిన ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో  ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల నమిత ముందడ  భీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున శాసనసభ సభ్యురాలు కూడా గెలుపొందింది. అయితే ప్రస్తుతం నమిత ఎనిమిది నెలల గర్భవతి. అయితే ఎమ్మెల్యేగా ఉన్న ఆమె నిండు గర్భవతి అయినప్పటికీ... నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చింది. 

 

 

 తమ నియోజక వర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి  పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతోనే.. ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే నమిత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం  దృష్టికి తీసుకు వెళతాను అంటూ ఆమె తెలిపారు. అందుకే నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ .. తమ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు ఎమ్మెల్యే నమిత తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ వైద్యులు ఇచ్చిన సలహాలను మాత్రం పాటిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: