ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న వైరస్ కరోనా . చైనా దేశంలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఉంది . ఇక చైనాలో పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది. రోజురోజుకు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమె  కాదు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దీంతో చైనా దేశం మొత్తం స్వీయ దిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ కు  ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ కూడా కనిపెట్ట లేకపోవడంతో ఈ వ్యాధి సోకితే ప్రాణాలు పోవడం ఖాయం గా మారిపోయింది. ఇక ఎంతో మంది శాస్త్రవేత్తలు... ఈ ప్రాణాంతకమైన వైరస్ కు  విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమై  ఉన్నారు. 

 

 

 ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలు తమ దేశంలోకి కరోనా  వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లో ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఈ కరోనా  కేసులు గుర్తించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెల్లడించింది. ఇక ఈ కరోనా  ఎఫెక్ట్ భారతదేశంలో కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో ముగ్గురికి కరోనా  ఉందని నిర్ధారణ కాగా రోజురోజుకూ అనుమానితులు కూడా  పెరుగుతున్నారు. ప్రస్తుతం మాత్రం 25 వేల మందికి పైగానే కరోనా అనుమానితులు  ఉన్నట్లు సమాచారం. 

 

 

 అయితే భారతదేశంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ వైరస్ శీతల పొడి వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఉపఖండంలో వేసవికాలం ప్రారంభం అవుతున్న డంతో... ఈ వైరస్ ప్రభావం భారత్ పై  తగ్గే అవకాశం ఉంది అని వైద్యులు సూచిస్తున్నారు. ఇక అటు కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా  కేసులు పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: