ఈ మధ్యకాలంలో మనం విమానాల్లో వింత ఘటనలు ఎక్కువగానే చూస్తున్నాం. ఒకసారి విమానంలో పాములు కనిపిస్తే మరోసారి పావురాలు కనిపిస్తాయి.. అసలు ఎలా వస్తాయో తెలీదు.. ఎవరు తెస్తారో తెలీదు.. ఎందుకు వస్తాయో తెలీదు.. విమానంలో హాల్ చల్ చేస్తాయి.. సోషల్ మీడియాలో ఎక్కుతాయి.  

 

అలా ఈ నేపథ్యంలోనే ఓ విమానంలోకి పావురం దూరింది. ప్రయాణికులను కాసేపు కలవరపెట్టింది. ఏంటి? పావురానికి భయపడ్డారా?వాళ్ళు ఎప్పుడు పావురాన్ని చూడలేదా అని మీకు సందేహం కలగొచ్చు. కానీ అక్కడ ప్రయాణికులు అంత కూడా పావురానికి భయపడలేదు.. ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అని భయపడ్డారు. 

 

నిజానికి కరోనా వైరస్ భయంతో ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆ సమయంలో విమానంలోకి పావురం రావడంతో అందరూ భయపడ్డారు. అయితే, ఎట్టకేలకు ఎయిర్ పోర్టు సిబ్బంది పావురాన్ని బయటకు పంపించేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో పావురం వచ్చి హల్ చల్ చేసింది. విమానంలో పావురం అటూ ఇటూ ఎగురుతూ ఉంటే కొందరు ప్రయాణికులు హడలి పోతుంటే మరికొందరు ఎంజాయ్ చేస్తూ ఆ పావురాన్ని సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: