అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్ది మంచి దూకుడు మీద జెట్ స్పీడుతో దూసుకు పోతున్నాడు. జగన్ దూకుడుకు చంద్రబాబునాయుడు కూడా చాలా సార్లు చేతెలెత్తేశాడు. చంద్రబాబంతటి వాడే చేతులెత్తేస్తే ఇక మిగిలిన నేతలెంత ?  జగన్ దూకుడును ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుందని అందరికీ భయం పట్టుకున్నట్లుంది. అందుకనే  చంద్రబాబు ఓ సూపర్ ఐడియాను కనిపెట్టినట్లున్నారు.

 

ఇంతకీ ఆ దారి ఏమిటయ్యా అంటే న్యాయస్ధానాలను అడ్డం పెట్టుకోవటమే. న్యాయ వ్యవస్ధలో చంద్రబాబుకు ఉన్న పట్టుగురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా ఎడాపెడా కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా కంట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకనే చంద్రబాబు ఆ దిశగానే చాలా స్పీడుగా వెళుతున్నాడు.

 

జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి కేవలం తొమ్మిది నెలలే అయ్యింది. అయితే చంద్రబాబుకు మాత్రం గడచిన తొమ్మిదేళ్ళుగా జగనే సిఎంగా ఉన్నంతగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ సఫకేషన్ నుండి బయటపడేందుకే తన పార్టీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ఇప్పటికి సుమారుగా ఓ పది అంశాల మీద కోర్టులో కేసులు వేయించారు. మొదటి పిపిఏల సమీక్షలకు వ్యతిరేకంగా తనకు సన్నిహితులుగా ఉండే వారితోనే కేసులు వేయించినట్లు సమాచారం.

 

ఆ తర్వాత పోలవరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు వ్యతిరేకంగా కేసులు వేయించారు. మళ్ళీ పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయించటంపైన కూడా కేసులు పడ్డాయి. ఆ తర్వాత స్ధానిక సంస్ధల్లో 59 శాతం రిజర్వేషన్లు కల్పించటంపైన కూడా కేసులు నమోదయ్యాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపైన కూడా కేసు వేశారు. తర్వాత మూడు రాజధానులు, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు, రాజధాని అమరావతి పరిధిలోని భూములను పేదలకు పట్టాలివ్వటం లాంటి అనేక అంశాలపై కేసులే కేసులు.  

 

ఇలా ప్రతి అంశంపైనా కేసులు వేయటం ద్వారా మాత్రమే జగన్ ను కట్టడి చేయగలమని చంద్రబాబు ఫైనల్ అయిపోయినట్లున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షంగా జగన్ ను ఎదుర్కోవటం తన వల్ల కాదని డిసైడ్ అయిపోయినట్లున్నాడు. మరి చూద్దాం ఈ గేమ్ కూడా ఎంతకాలం కంటిన్యు అవుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: