బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ సౌమ్య సర్కార్ మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడో  తెలిసిన విషయమే. తనదైన ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్  విజయం వైపు నడిపిస్తు ఉంటాడు సౌమ్య సర్కార్. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ తరపున ఎన్నో మ్యాచులు ఆడిన సౌమ్య సర్కార్ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకోవడం తో పాటు తన ఆటతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ స్టార్  క్రికెటర్  సౌమ్య సర్కార్ పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్  సౌమ్య సర్కార్ పెళ్లి రచ్చరచ్చగా ముగిసింది. ఈనెల 26న ప్రియామ్ టి దేబ్ నాథ్ ను  సౌమ్య సర్కార్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎవరికైనా పెళ్లి అంటే అది ఒక మధుర జ్ఞాపకం గా మారిపోతుంది. కానీ బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ సౌమ్య సర్కార్ కు మాత్రం అతనికి పెళ్లి  ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

 

 

 సౌమ్య సర్కార్ పెళ్లికి అతిథులతో పాటు కొంత మంది దొంగలు కూడా వచ్చారు. దీంతో ఈ పెళ్లిలో అతిథుల ఫోన్ లను  దొంగలు చాకచక్యంగా దొంగిలించారు . ఇక ఒక్కసారిగా చాలామంది ఫోన్లు కనిపించకపోవడంతో సౌమ్య సర్కార్ పెళ్లి లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక బాధితుల్లో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో పాటు సౌమ్య సర్కార్  తండ్రి కూడా ఉండటం గమనార్హం. ఇక అప్రమత్తమైన బాధితులు ఫోన్ లను  దొంగలించినట్లుగా భావిస్తున్న అనుమానితులను పట్టుకున్నారు. దీంతో దొంగల గ్యాంగ్ పెండ్లికొడుకు కుటుంబ సభ్యుల పై దాడికి దిగింది. ఈ క్రమంలో ఎంతో ఆనందంగా ఉండాల్సిన పెళ్లి వేడుక కాస్త రచ్చరచ్చగా మారిపోయింది. 

 

 

 వేడుక జరగాల్సిన పెళ్లి మండపం మొత్తం  రసాభాసగా మారి పోయింది. ఇక దొంగలు... పెళ్లి కి విచ్చేసిన వారి మధ్య గొడవ మరింత ముదరడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇక ఆ తర్వాత పెళ్ళి తంతు సజావుగా సాగింది. దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న ఓ జర్నలిస్టు అక్కడ జరుగుతున్న రచ్చ  మొత్తం చిత్రీకరిస్తున్న సమయంలో సౌమ్య సర్కార్ కుటుంబ సభ్యులు ఆ జర్నలిస్టును  అడ్డుకున్నారు. ఏదేమైనా స్టార్ క్రికెటర్ పెళ్లి మధురానుభూతిని కాకుండా చేదు అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: