కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్నది.  దీనిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా తగ్గడం లేదు.  అరికట్టడానికి అన్ని రకాల మార్గాలను అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి.  ఇప్పటికే 57 దేశాల్లో కరోనా ప్రభావం చూపించింది.  చైనా తరువాత అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశం దక్షిణ కొరియా.  అక్కడ ఇప్పటికే 2931 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఆ దేశం అప్రమత్తం అయ్యింది.  


కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది.  చాలా చోట్ల జనజీవనం స్తంభించింది.  చైనాలో ఈ సంఖ్య తగ్గుముఖం పడుతుండటం, దక్షిణ కొరియాలో ఈ కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలోని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  దక్షిణ కొరియా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.  ఆర్ధికంగా బలమైన దేశం. అయితే, ఇప్పుడు దానిని అనుకోని ఉన్న ఉత్తర కొరియాకు కరోనా భయం పట్టుకున్నది. 


ఉత్తర కొరియా పేదదేశం.  పైగా ఏ దేశాలతో ఆ దేశానికి సంబంధాలు ఉండవు.  అక్కడ కిమ్ పరిపాలనలో ఉన్నది ఆ దేశం.  దక్షిణ కొరియాలో ఈ వైరస్ వ్యాపించడంతో ఉత్తర కొరియా అప్రమత్తం అయ్యింది.  కరోనా ఉత్తర కొరియాలోకి వ్యాపించకుండా చూసుకోవాలని కిమ్ అధికారులను ఆదేశించారు.  వైరస్ ను అడ్డుకోవడంలో విఫలమైతే తగిన చర్యలు తప్పవని ఆదేశించారు.  


గతంలో ఓ వ్యక్తికీ కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఆదేశ అధికారులు నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.  దీంతో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  అలసత్వం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయో వాళ్లకు బాగా తెలుసు.  అందుకే వీలైనంతగా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఏది ఏమైనప్పటికి కూడా ఈ వైరస్ ను అడ్డుకోవడానికి కొరియా సన్నద్ధమైన సంగతి తెలిసిందే. మరి కిమ్ ప్రభుత్వం దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొంటుందా చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: