ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. వాళ్ళు కొన్ని కొన్ని వ్యవహారాల్లో అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు వాళ్ళ కేంద్రంగా విమర్శలకు వేదిక అవుతుంది. పోలీసులు అధికార పార్టీకి అండగా ఉండటం, ముఖ్యమంత్రులు, మంత్రులు చెప్పింది చేయడం సహజం. కాని వాళ్ళు మాత్రం మరింతగా చెలరేగిపోతున్నారు. అధికార పార్టీకి నచ్చని వారిని ఇబ్బంది పెట్టడంలో ముందు ఉంటున్నారు ఏపీ పోలీసులు. వాస్తవంగా మాట్లాడితే గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో పోలీసుల తీరు తప్పు అనేది కొందరు మాట్లాడే మాట. 

 

అసలు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది ముందు. అనుమతి ఇచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం తిప్పి పంపడం అనేది ముమ్మాటికి తప్పు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక్కడ చంద్రబాబుకి వంత పాడటం అని కాదు గానీ... ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంత మంది ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలి రావడం అనేది ముందు పోలీసుల వైఫల్యం. వాళ్ళల్లో ఎవరైనా ఏదైనా చేసి హాని తలపెడితే ముందు బలయ్యేది డీజీపి. తర్వాత హోం మంత్రి. 

 

జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి కాబట్టి బ్లాక్ కమాండో లు ఫైర్ ఓపెన్ చేస్తే అక్కడ పరిస్థితి మరో రకంగా ఉంటుంది. అనవసరంగా డీజీపీ కోర్ట్ కి వెళ్ళాలి సమాధానం చెప్పాలి. వాళ్లకు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఫైర్ ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు కేంద్రం కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. గురువారం జరిగిన వ్యవహారం మొత్తాన్ని హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. నిఘా వర్గాలు కూడా దాని మీద దృష్టి పెట్టాయి. రాజు అనే వ్యక్తి కేంద్రంగా అక్కడ అలజడి జరిగిందని నిఘా వర్గాలు గుర్తించాయి. కాబట్టి పోలీసులు కాస్త వెనక్కు తగ్గితే వాళ్ళ భవిష్యత్తుకే మంచిది అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: