2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరం బాగానే హైలైట్ అయిన తెలిసిందే. అమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల విజయవాడకు చాలా అడ్వాంటేజ్ పెరిగింది. అయిదేళ్ళల్లో నగరంలో మంచి అభివృద్ధే జరిగింది. ఇక అభివృద్ధితో పాటు, స్టేట్ పాలిటిక్స్‌కు సెంటర్ పాయింట్ అయిపోయింది. ఈ విధంగా రాజకీయాలకు అడ్డాగా ఉన్న విజయవాడపై తెలుగుదేశం పార్టీ మంచి గ్రిప్ తెచ్చుకుంది. తాము చేసిన అభివృద్ధి, 2019 ఎన్నికల ఫలితాల్లో చాలావరకు కనిపించింది.

 

రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్న విజయవాడ ఎంపీ సీటు మాత్రం టీడీపీ ఖాతాలోనే పడింది. అటు నగరంలో ఉన్న మూడు సీట్లలో టీడీపీ విజయవాడ తూర్పుని 15 వేల పైనే మెజారిటీతో కైవసం చేసుకుంది. అయితే సెంట్రల్ సీటుని మాత్రం కేవలం 25 ఓట్ల తేడాతో కోల్పోతే, వెస్ట్ సీటుని 7వేల మెజారిటీ తేడాతో కోల్పోయింది. ఆ రెండు సీట్లు కోల్పోయిన నగరంపై టీడీపీకి ఉన్న గ్రిప్ పోలేదు. అధికారం లేకపోయిన నగరంలో టీడీపీకి బలం తగ్గలేదు. పైగా ప్రభుత్వం మూడు రాజధానులు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది.  

 

ఇటు నగరంలో ఉన్న టీడీపీ నేతలు యాక్టివ్‌గా పని చేసుకుంటున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో పని చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నారు. తాజాగా పెన్షన్, రేషన్ కార్డుల తొలగింపుపై బాధితులకు అండగా నిలుస్తున్నారు. అటు సెంట్రల్‌లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమా, నియోయజకవర్గంలో సమస్యలపై పోరాడుతున్నారు.

 

రోజు ప్రజా చైతన్య యాత్ర పేరుతో డివిజన్ల వారీగా తిరుగుతూ, ప్రజలని కలిసి, వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. ఎంపీ కేశినేని నాని కూడా తన పరిధి వరకు బాగానే పని చేసుకుంటున్నారు. ఇలా వీరు యాక్టివ్‌గా ఉన్న వెస్ట్‌లో మాత్రం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు కనిపించడం లేదు. మొన్న ఎన్నికల్లో వయసు మీద పడటంతో జలీల్ పోటీ నుంచి తప్పుకుని, తన కుమార్తె షబానాని పోటీకి దించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఓడిపోయాక విదేశాలకు వెళ్లిపోయింది.

 

దీంతో వెస్ట్‌లో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి. అటు వెస్ట్‌కే చెందిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అధిష్టానం నియోజకవర్గంపై కాస్త ఫోకస్ పెట్టి పని చేసుకుంటే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ నగరాన్ని టీడీపీ సొంతం చేసుకోగలుగుతుంది. ఈస్ట్, సెంట్రల్‌లు ఎలాగో లైన్‌లో ఉన్నాయి కాబట్టి వెస్ట్‌ని కూడా సెట్ చేస్తే టీడీపీకి ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: