అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కన్నవారి కళ్ల ముందే అనంత లోకాలకు పోతే ఆ భాద వర్ణాతీతం. అప్పటి వరకు తండ్రితో కలిసి పొలంలో పని చేసిన కుమారుడు తండ్రి కళ్లముందే జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తల్లికి కడుపు కోతను మిగిలించాడు. వృద్యాప్యంలో వారిని చూసుకుంటాడని వారు పెట్టుకున్న ఆశలను ఆవిరి చేస్తూ వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు బాగా చదివి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడి వారి కష్టాలను తీరుస్తాడునుకుంటే.. కానీ వారి కలలు ఆవిరైయ్యాయి. ఈ విషాద ఘటన కొమరం భీం జిల్లా సిర్పూర్ చోటు చేసుకుంది. 

 

సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన దేశ్ ముఖ్ శివ్ దాస్ అనే 15 ఏళ్ల బాలుడు. పోచంలొద్ది బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఫిట్స్, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తండ్రి రెండు నెలల కిందట హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.

 

ఈ క్రమంలో గురువారం తండ్రి జైరామ్‌ తో కలిసి బాలుడు పొలం పనికి వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో శివ్ దాస్ తండ్రికి ఫోన్ చేసి తాను కుండాయి జలపాతం పైన ఉన్నానని.. భయంగా ఉందని చెప్పాడు. త్వరగా రా నాన్న అంటూ మాట్లాడాడు. భయాందోళనకు గురైయ్యాడు. వెంటనే  తండ్రి జైరామ్ నలుగురితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం బాలుడు తండ్రి కళ్ల ముందే తన ఫోన్‌ ను పక్కన పడేసి, జలపాతంలోకి దూకేశాడు.

 

ఈతగాళ్లతో పాటు పోలీసులు చుట్టు పక్కల వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. చివరికి గజ ఈతగాళ్లను పిలిచి వెతికించగా, వారు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: