రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు రాజకీయ అంశాలు ముడిపడి ఉన్న విషయాలపై తన స్పందన తెలియజేస్తూ ఈ మధ్య కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. అంతేకాకుండా జగన్ పరిపాలన పై స్పందిస్తూ.. జగన్ ప్రజల మెచ్చిన నాయకుడు అంటూ పొగుడుతున్నారు. ఇక అమరావతి విషయంలోనూ స్పందించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం సరైనదని ప్రకటించారు. జగన్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి అమరావతి పరిసర ప్రాంతాల్లో చిరంజీవి వ్యవహారంపై నిరసన వ్యక్తమవుతోంది. 


తాజాగా అమరావతి జేఏసీ చిరుని టార్గెట్ గా చేసుకుని ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టి అమరావతి కి మద్దతుగా చిరంజీవితో ప్రకటన చేయించాలని భావిస్తోంది. అయితే ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమంగా మారుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమరావతి జేఏసీ దీనిని వాయిదా వేసుకుంది. అయినా చిరు నివాసం వద్ద ధర్నా కానీ, ఆందోళన కార్యక్రమాలు గాని నిర్వహించే అవకాశం ఉన్నట్లు గా భావిస్తూ చిరు నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అమరావతి యువసేన జేఏసీ ప్రకటించింది. 

IHG

అయితే తాము ఎటువంటి ఆందోళనలు చేయమని చిరంజీవిని మర్యాదపూర్వకంగా ఎటువంటి ఆందోళన నిర్వహించమని వారు పేర్కొంటున్నారు. గతంలో మహేష్ బాబు మద్దతు కోసం ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపినట్లే మెగాస్టార్ ను కలిసి శాంతియుత మార్గంలో అమరావతి వ్యవహారాన్ని వివరించాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని, అంతే తప్ప ఎటువంటి ఆందోళనలు చేయమంటూ వారు పేర్కొంటున్నారు. ఈ గందరగోళం మధ్య మెగాస్టార్ చిరంజీవి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి, చిరు నివాసం వైపు ఎవరూ వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: