ఈ మధ్యకాలంలో మనిషిలో మానవత్వం రోజురోజుకూ చచ్చిపోతుంది. కనీసం మానవత్వాన్ని మరిచి సాటి మనిషి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు సాటి మనుషుల. కొంతమంది కన్న ప్రేమను మరచి సొంత పిల్లలను కడతేరుస్తుంటే కొంతమంది... తమకు జన్మనిచ్చిన నవమాసాలు మోసిన తల్లిదండ్రులపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తమకు జన్మనిచ్చి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను నిరంతరం కాపాడుకోవాల్సింది  పోయి అతి దారుణంగా కాటికి పంపించేస్తున్నారు. ఇలా మానవత్వం మరిచిన ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

 

 

 

 ఇక్కడ డబ్బులు కోసం ఓ యువతి చేసిన పని సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది.  భీమా  డబ్బుల కోసం ఏకంగా తల్లి చనిపోయింది అంటూ చెప్పి తల్లి గుండెను బద్దలు చేసింది కూతురు. వివరాల్లోకి వెళితే... కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ లోని బలిజేపల్లి కు చెందిన ఆదిలక్ష్మమ్మ వెంకటరత్నం దంపతులకు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే తిరుపతి లో నివాసం ఉంటున్న కుమార్తె శాంతి కుమారి.. వీరి ఇంట్లో గత ఏడాది నవంబర్ 14న వెంకటరత్నం చనిపోయాడు. అయితే చనిపోయిన వెంకటరత్నం పేరు... చంద్రన్న బీమా పథకం లో నమోదయింది. వెంకట రత్నం నామినిగా  భార్య ఆదిలక్ష్మి పేరు దరఖాస్తులో  ఉంది. అంటే వెంకటరత్నం బీమా డబ్బులు భార్య ఆదిలక్ష్మికి రావాల్సి ఉంది. 

 

 

 ఇక బీమా డబ్బుల విషయంలో నీచంగా ఆలోచించిన కూతురు శాంతకుమారి తన తండ్రి కంటే ముందే తన తల్లి చనిపోయింది అంటూ  రాజంపేట మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. సొంత కూతురి తల్లి చనిపోయింది అని చెప్పడంతో నిజమే అని నమ్మిన అధికారులు ఎలాంటి విచారణ జరుప కుండానే... తన తండ్రి బీమాకు నామినీగా శాంతకుమారి పేరు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలియని ఆదిలక్ష్మమ్మ తన భర్త చనిపోయాడు అని బీమా డబ్బు ఇవ్వాలంటూ అధికారులను కోరింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఇక ఇంతలో షాకైన అధికారులు ఆమె ఆధార్ కార్డు చెక్ చేసారు. అయితే  చనిపోయింది అనుకున్న మహిళ.. ఎదురుగా ఉండడంతో ఒకింత ఆశ్చర్యానికి ఒకింత షాక్ కి గురయ్యారు సిబ్బంది. ఇక తాజాగా ఇటీవల జిల్లా ఎస్పీని స్పందన కార్యక్రమం లో కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు అధికారులు

మరింత సమాచారం తెలుసుకోండి: