2020-21 ఆర్ధిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉండేట్లుంది. చంద్రబాబునాయుడు హయాంలో ప్రవేశపెట్టినట్లుగా మాయలు, భ్రమల్లాగ కాకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని జగన్ గట్టిగా హెచ్చరించారు. దాంతో  ముఖ్యమంత్రి ఆదేశాలకు తగ్గట్లే వాస్తవ అంచనాలతో కుస్తీలు పడుతున్నారు.  చంద్రబాబు హాయంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2.27 లక్షల కోట్లుగా చూపించారు.

 

అయితే తొందరలో వైసిపి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ స్వరూపం సుమారు రూ. 1.90 లక్షల కోట్లుంటుందని ఓ అంచనా. ప్రస్తుత బడ్జెట్ ను రూ. 2.27 లక్షల కోట్లతో ప్రతిపాదించినా ఇప్పటి వరకూ చేసిన ఖర్చు సుమారు రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్ ప్రతిపాదనకు చేసిన ఖర్చుకు సుమారు రూ 67 వేల కోట్లు తేడా ఉంది. ఎందుకిలా అంటే డబ్బు చేతిలో ఉండి బడ్జెట్ ప్రిపేర్ చేయటం కాదు. కేంద్రం నుండి వస్తుందని అంచనా వేసిన డబ్బును ఆదాయం క్రింద చూపించేశారు.

 

అయితే కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడింది. దాంతో చేయాల్సిన ఖర్చుల్లో కూడా తేడా వచ్చేసింది. అందుకే ఎక్కడ చూసినా అప్పులు, వడ్డీలే. ఉదాహరణకు రాష్ట్ర విభజన తర్వాత రెవిన్యు లోటును రాష్ట్రం రూ. 19 వేల కోట్లుగా చూపుతునే ఉంది. అయితే కేంద్రం ఎప్పుడూ ఇవ్వలేదు. కేంద్రం నుండి రావాల్సిన రూ. 19 వేల కోట్లను రాష్ట్రం బడ్జెట్లో ఆదాయంగా చూపటమే విచిత్రం. అంటే ఇటువంటి పద్దుల విషయంలో వాస్తవాల ఆధారంగా బడ్జెట్ తయారు చేయాలని జగన్ ప్రభుత్వం అనుకుంటోంది.

 

అందుకనే కేంద్రం నుండి వచ్చే అవకాశం లేని నిధులన్నింటిని రాష్ట్రాల ఆదాయాల పద్దుల నుండి మినహాయించాలని డిసైడ్ అయ్యిందట. ఇటువంటి మైనస్ లు, ప్లస్ లను జాగ్రత్తగా లెక్కేసి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. అందుకనే బడ్జెట్ సుమారు . 1.9 లక్షల కోట్లుగా ఉండబోతోందని సమాచారం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: