తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా, కెసిఆర్ ను అడుగడుగున అడ్డుకుంటూ ఆయనపై విమర్శలు  చేయగలిగిన ఏకైక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పట్నం గోస పేరుతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఆ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ పైనా తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ దూకుడికి కళ్లెం వేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన గతంలో కొనుగోలు చేసిన ఈ వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి  ఈ భూములను కొనుగోలు చేశారని టిఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తూ దీనిపై విచారణ కూడా ఆదేశించింది. 

IHG

 

ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన జూపల్లి రామేశ్వర్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు అదనపు భద్రత ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను కోర్టులో వారిపై పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని అందుకే వారు తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని కోర్టులో రేవంత్ పిటిషన్ వేశారు. అదనపు భద్రత కోసం రేవంత్ రెడ్డి చాలా కాలంగా పోరాడుతున్నారు. తనకు రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కువని, తనకు భద్రత పెంచాలని ఆయన అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు.

IHG


 అయినా దీనిపై టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డికి త్రీ ప్లస్ త్రీ భద్రత ఉండేది. అయితే ఆ తర్వాత దానిని తగ్గించారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా భద్రత తగ్గించడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా భద్రత పెంచాలని దరఖాస్తు చేసుకున్నారు. అయినా పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి టిఆర్ఎస్ పెద్దలను నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: