ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే హత్య వివాదాలు ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి దుమారాన్నే రేపాయి. ఇక తాజాగా కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి... నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్... వైసిపి ముఖ్య నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఒప్పుకున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఆమె తెలిపారు. వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వివాదాలను సద్దుమణిగేలా చేసే బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తనకు అప్పగించారు అంటూ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చెబుతున్నారు. 

 

 

 అయితే నందికొట్కూరు మార్కెట్ కమిటీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది . అయితే నందికొట్కూరు మార్కెట్ కమిటీ గురించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించామని తెలిపిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి... నందికొట్టుకురు మార్కెట్ కమిటీ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే  ఫైనల్ డెసిషన్ అంటూ తేల్చి చెప్పారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థార్  మధ్య ఉన్న విభేదాలు కుటుంబ సమస్యలు గా భావిస్తున్నాము అంటూ తెలిపారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. వారిద్దరు వివాదాలు కుటుంబ సమస్యలు గానే  భావిస్తున్నామని వేరే విధంగా భావించడం లేదు అంటూ ఆమె తెలిపారు. 

 

 

 బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడు అంటూ ఆమె తెలిపారు. ఇక ఎమ్మెల్యే అర్థర్  కూడా బాగా చదువుకున్నారని ఇంతకు మునుపు ఎస్పీగా కూడా పని చేశారు అంటూ ఎమ్మెల్యే  శిల్పచక్రపాణి రెడ్డి గుర్తు చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య గ్యాప్  వుంది అంటూ తెలిపిన ఆమె... నందికొట్కూరు నియోజకవర్గంలో పలు బదిలీల విషయంలో ఇద్దరి మధ్య తేడా వచ్చింది అంటూ తెలిపారు. ఇక ఈ విషయంపై స్పందించిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య వివాదాలు సద్దుమణిగేలా కూర్చోబెట్టి.. మాట్లాడి కలిసి ముందుకు సాగేలా చేయాలని... తనకు ఆదేశించారని చెప్పారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఇలా ఉంటే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్  అనుచరులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో పాటు మంత్రి అనిల్ కుమార్ పైన కూడా విమర్శలు గుప్పించారు  మంత్రి తమ నియోజకవర్గ వ్యవహారాలు పట్టించుకోవటం మానెయ్యాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: