ఈ మధ్యకాలంలో రోజురోజుకు హత్యలు ఎక్కువగా పెరిగి పోతున్నాయి. వివాదాలు ఏవైనా దారుణంగా హత్య చేసి పరార్  అవుతున్నారు దుండగులు. ఇక గత కొంతకాలంగా తమిళనాడులో జరుగుతున్న హత్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. గతంలో కోర్టులో వాదోపవాదాలు వినిపించి బయటకు వస్తున్నా ఓ రౌడీ షీటర్ ప్రత్యర్థి రౌడీషీటర్ అతి దారుణంగా రోడ్డుపైన కిరాతకంగా నరికి చంపాడు. ఇక ఈ ఘటన మరవకముందే చెన్నైలో మరో దారుణ హత్య జరిగింది. ఓ రౌడీ షీటర్ ను అతి దారుణంగా ఎనిమిది మంది యువకులు చుట్టుముట్టి దాడిచేసి కత్తులతో అతి దారుణంగా నరికి చంపేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.... దివాకర్ అనే వ్యక్తి చెన్నైలోని కాశీ మెడ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఇతను సెటిల్మెంట్లు దందాలు చేస్తూ ఉంటాడు. ప్రేమ వ్యవహారాలు కాలేజీ విద్యార్థుల మధ్య తలెత్తిన గొడవలను పరిష్కరిస్తూనే  మరోవైపు భారీ మొత్తంలో భూ  సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉంటాడు. ఇక ఇతనికి నేర చరిత్ర కూడా బాగానే ఉంది. ఇక దివాకర్ పై రౌడీషీట్ కూడా ఉంది . అయితే సెటిల్మెంట్ లో భాగంగానే తాజాగా ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు దివాకర్. తాను  చెప్పినట్టు చేయాలని లేకపోతే ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరించాడు. ఇక దివాకర్ వార్నింగ్ తో భయపడి పోయినా ఆ వ్యక్తి ఎక్కడ తనను  తన భార్యను చంపేస్తాడో  అనే భయంతో... తన స్నేహితులతో కలిసి ఏకంగా దివాకర్ ని హత్య చేశాడు. 

 

 

 అందరూ చూస్తుండగానే అతి దారుణంగా మొత్తం ఎనిమిది మంది యువకులు రౌడీషీటర్ దివాకర్ ని అతి దారుణంగా నరికి చంపారు. అయితే పక్కనే చాలా మంది ఉన్నప్పటికీ ఎలాంటి భయం కానీ శిక్ష పడుతుంది అనే ఆలోచన కానీ లేకుండా విచక్షణారహితంగా రౌడీషీటర్ దివాకర్ నరికి చంపారు దుండగులు. అయితే పక్కనే ఉన్న వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. రౌడీషీటర్ దివాకర్ పై దాడి చేస్తున్న యువకులు చేతిలో పదునైన కత్తులతో పాటు మరిన్ని ఆయుధాలు ఉండడంతో దగ్గరకు వెళ్లి వారిని నియంత్రించేందుకు కూడా భయపడిపోయారు స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మూకుమ్మడిగా రౌడీషీటర్ దివాకర్ పై దాడి చేసి అతి దారుణంగా నరికి చంపిన దుండగులు అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. అయితే ఈ హత్య అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కాగా వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం ఉన్నది అనే దానిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: