పాకిస్తాన్ మొత్తం 130 కిపైగా ఉగ్రవాద సంస్థలు ఉన్న సంగతి ప్రపంచానికి తెలుసు.  పాక్ లో టాప్ మోస్ట్ ఉగ్రవాదులు ఉన్న సంగతి కూడా తెలిసిందే.  ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఉగ్రవాదంపై పోరాటం చేయాలని, పాక్ లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేసినపుడే ప్రపంచం శాంతంగా ఉంటుందని పాక్ లోని ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాలని ఆ దేశానికీ మైనారిటీలు జెనీవాలో నినాదాలు చేశారు. 


జెనీవాలో ఐరాస మానవహక్కుల సంఘం వార్షిక సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సమావేశాల్లో అంతర్జాతీయ నేతలు పాల్గొంటున్నారు.  కాగా, అక్కడ పాక్ దేశానికీ చెందిన మైనారిటీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్ ను కాపాడాలని వేడుకుంటున్నారు.  పాక్ ఉగ్రవాదులకు ఆర్మీ సహాయం చేస్తోందని, ఆర్మీ అండదండలు లేకుండా ఉగ్రవాదులు రెచ్చిపోలేరని అంటున్నారు.  


ఈ ఉగ్రవాదం వలన పాక్ దేశానికీ మాత్రమే కాదు, అటు ప్రపంచం మొత్తానికి కూడా ఇబ్బందులు వస్తాయని, పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాల వలన ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఇబ్బందులు పడుతుందని అంటున్నారు.  ఇదిలా ఉంటె పాక్ లో ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవలే ట్రంప్ ఇండియా వచ్చిన సందర్భంగా పేర్కొన్నారు.  


అదే విధంగా ఆ దేశం ఆర్మీతో కలిసి వారికీ ట్రైనింగ్ ఇస్తామని ట్రంప్ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు.  ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు ఆర్ధికంగా సహాయం చేయకూడదు అని చెప్పి ఏఎఫ్ టిఎఫ్ సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆ సంస్థ పాక్ ను గ్రే లిస్టులో పెట్టింది.  ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల విషయంలో మరోసారి త్వరలోనే ఫ్రాన్స్ లో సమావేశం కానున్నారు.  అప్పుడు  పాక్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: