సీఏఏ యాక్ట్ కు నిరసనగా ఢిల్లీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీలో అల్లర్లకు తెర తీసింది. ఈ సందర్భంగా నాలుగు రోజులపాటు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసం అయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు, పౌరులు అనేక మంది మరణించారు. మొన్నటి వరకు ఢిల్లీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే జనం వీధుల్లోకి వస్తున్నా ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో అని భయం భయంగా ప్రజలంతా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీధుల్లో ఎక్కడ చూసినా రాళ్లు, కూలిపోయిన గోడలు ఇవన్నీ దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో అల్లర్లు తగినా ఇంకా అక్కడి వాతావరణం సద్దుమణగలేదు. 

IHG


భారీగా భద్రతను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఢిల్లీలో లెఫ్ట్నెంట్ జనరల్ బైజల్ సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి మౌస్ పూర్, జఫరాబాద్, గోకులపురిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఏడు వేల మంది పారామిలటరీ దళాలు సమస్యాత్మక ప్రాంతాల్లో నిత్యం పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో అల్లర్లు తగ్గడంతో ఈ సంఘటనలకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. వీడియో, సీసీ పూటేజీ ఆధారంగా అల్లరి మూకలను, దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 మందిపై కేసు నమోదు చేశారు. 


సుమారు 638 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ సంఘటనలో 42 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఇంకా అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత మందికి బుల్లెట్ గాయాలు, మరికొంతమందికి  కత్తిగాట్లు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తున్నా, ప్రజల్లో మాత్రం భయం పోలేదు. ఇక రాకఁజకీయ పార్టీలు అయితే ఈ వ్యవహారంలో మీది తప్పు అంటే మీది తప్పు అంటూ ఒకరి మీద మరొకరు బురద జల్లుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: