కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సిన స్టూడెంట్స్ రౌడీళ్లా మారారు. నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు...ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి గ్రూప్ వార్ కు దారి తీసింది. 

 

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థుల మధ్య గ్రూప్ వార్ రోడ్డుకు చేరింది. ఇంటర్ విద్యార్థులు పట్ట పగలు వీధి రౌడీల్లా నడిరోడ్డు పైనే చితక్కొట్టుకున్నారు.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. విద్యార్థుల ఘర్షణతో రోడ్డుపై గంటసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి. పాలకొండలో జరిగిన ఈ ఘటన హాట్‌టాపిక్ అయ్యింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే గొడవ జరిగింది.

 

వివరాల్లోకి వెళితే.. తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల మధ్య వివాదం రేగింది. కాలేజీ సమీపంలో బైక్‌ పై వెళ్తున్న ఫస్టియర్ విద్యార్థి.. సెకండియర్ చదువుతున్న పాలకొండకు చెందిన విద్యార్థిని ఢీ కొట్టాడు. ఇద్దరూ గొడవకు దిగారు.. లోకల్ ఫీలింగ్‌ తో మాటా, మాటా పెరిగింది. ఫస్టియర్ విద్యార్థిని సెకండియర్ విద్యార్థి చితకబాదాడు.

 

కొద్దిసేపటి తర్వాత ఫస్టియర్ విద్యార్థి తన స్నేహితులను అక్కడికి పిలిచాడు. అటు సెకండియర్ విద్యార్థి స్నేహితులు కూడా వచ్చారు. రెండు గ్రూపులు నడిరోడ్డుపై వీధి రౌడీల్లా మారి కొట్టుకున్నారు. స్థానికులు గొడవను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్‌ కు సమీపంలోనే ఘటన జరిగింది. 

 

గొడవ కారణంగా గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మీడియాలో ఈ ఘటనపై కథనాలు రావడంతో పోలీసులు స్పందించారు.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తమ కాలేజీ విద్యార్థులు వీధి రౌడీళ్ల రోడ్ల పై కొట్టుకుంటున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: