అమ్మాయిల పై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొస్తున్న అమ్మాయిల పై నేరాలు కూడా లేదు అందుకే బాంబే కొత్త  తీసుకొచ్చింది. ప్రేమించా.. నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ మహిళలను మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకునే కామాంధులకు బోంబే హైకోర్టు దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. ‘ ప్రేమిస్తున్నానని వెంటపడటం, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేస్తే దాన్ని ఇకపై అత్యాచారంగానే పరిగణిస్తామని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.

 

 


మోసం చేసి పెళ్లి చేసుకుంటామని పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారమే అవుతుందని పేర్కొంది. ఈ కేసు విషయంలో న్యాయస్థానం తీర్పునిస్తూ న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రియుడి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా అనుభవించి ఇప్పుడు మొహం చాటేశాడంటూ ముంబయికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. అయితే ఆమె ప్రియుడు మాత్రం ఇద్దరి ఇష్టంతోనే అనేకసార్లు సెక్స్‌లో పాల్గొన్నామని, దీన్ని అత్యాచారంగా ఎలా పరిగణిస్తారంటూ కోర్టులో సవాల్ చేశాడు. 

 

 

అయితే ఈ విషయం పై పూర్తి చర్యలు జరిపిన కోర్టు దీన్ని పరిశీలించిన జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ మాధవ్ జాందర్‌లతో కూడి బెంచ్ మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇష్టపూర్వకంగానే లైంగిక సంబంధం పెట్టుకున్నా పెళ్లి చేసుకుంటానన్ని హామీతోనే ఆమె హద్దులు దాటిందని న్యాయస్థానం పేర్కొంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోనప్పుడు అది అత్యాచారమే అవుతుందని వ్యాఖ్యానించింది.

 


అబ్బాయిల ఆగడాలు  రోజుకు రోజుకు ఎక్కువవుతున్నాయి  చెప్పి మోసం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. దీనివల్ల అమ్మాయిలు అబ్బాయిలను గుడ్డిగా నమ్మి మోస పోతున్నారని ఇలాంటి తీర్పు ఇస్తున్నట్లు తెలిపారు. ఆ చట్టాలను ఉల్లఘింస్తూ ఏదైనా చేస్తే మాత్రం పోలీసులు తగిన బుద్ది  చెప్పాలని తీర్పు చెప్పింది. అబ్బాయిలై తస్మాత్ జాగ్రత్త సుమీ.. రిలేషన్ అంటూ వెంటపడితే మీకు నూకలు చెల్లినట్లే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: