అమ్మవారి జాతర అంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. పసుపు కుంకుమలతో బోనాలు... డప్పు చప్పులు శివసత్తుల పూనకాలు.. ఇలా హోరెత్తిపోతు ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి జాతర అనగానే పూనకం వచ్చిన  మహిళలు చేసే హడావిడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక అమ్మ వారిని శాంతింప చేసేందుకు లేదా ఏవైనా మొక్కులు ఉన్నవారు మేకపోతులను కోడి పుంజులను బలిస్తూ  ఉంటారు. ఇలాంటివి ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి లేకుండా అసలు జాతర వాతావరణమే అని అనరు. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారి జాతరకు కాస్త డిఫరెంట్ గా జరుపుకుంటారు. ఒకరినొకరు తెగ ముద్దులు పెట్టుకుంటూ... డాన్సులు చేస్తారు. మామూలుగా అయితే.. దేవాలయంలో ముద్దులు పెట్టుకోవడం రొమాన్స్ లాంటివి అపవిత్రంగా భావిస్తూ ఉంటారు కానీ ఇక్కడి ఆలయంలో మాత్రం ఇదే ఆచారం ఇలా చేయకపోతే అపవిత్రం అంటున్నారు. 

 

 

 ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా.. అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని బళ్లారి జిల్లాకు ఆనుకొని ఉన్న దావణగెరె జిల్లా పరిధిలోని మా గాన హల్లి  గ్రామంలో... ప్రతి పదేళ్లకు ఒకసారి ఊరమ్మ దేవి జాతర నిర్వహిస్తూ ఉంటారు. పదేళ్లకు ఒకసారి ఈ జాతర వస్తుండడంతో ఈ జాతర ఎంతో విశిష్టతను సంతరించుకుంది. మాగన  హళ్లి గ్రామం దేవత జాతరలో శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్లు గురించి పక్కన పెడితే... భక్తులు జంటలుగా డాన్స్ చేయడం ఇక్కడి ఆనవాయితీ. కేవలం డాన్స్ చేయడమే కాదు తెగ ముద్దులు పెట్టుకోవడం కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. 

 

 

 ముఖ్యంగా పెళ్లయిన దంపతులు ఇలా జాతరలో డాన్సులు చేస్తూ తెగ ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఇది పబ్లిక్ రొమాన్స్ గా అనిపించినప్పటికీ... ఈ వింత ఆచారాన్ని పాటించక పోతే అమ్మవారు సంతృప్తి చెందదు  అని స్థానికులు చెప్పడం విశేషం. తామంతా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఇలాంటి ఆచారాన్ని పాటిస్తున్నాము అని  స్థానికులు చెబుతూ ఉంటారు. సాధారణంగానే జాతరలో తొలుత అమ్మవారికి విశేష అలంకరణలు పూజలు చేస్తామని అనంతరం ఇలాంటి ఆచారాన్ని  చేస్తూ ఉంటాము  అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆచార సంప్రదాయాలతో ఈ జాతరలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: