ఇప్పటికే పడుతూ లేస్తూ దేశవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటోంది. కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం కానీ ఆశలు గాని ఆ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. ఇక తెలంగాణలోనూ ఇంతకంటే ఘోరమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆదరణ ఉంటుందని ముందుగా హై కమాండ్ భావించినా ఆ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోవడం, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం, కాంగ్రెస్ హైకమాండ్ ను కూడా కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు అవేమీ వర్కవుట్ అవ్వడంలేదు.  


ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ కు దీటుగా సీట్లు సాధిస్తామని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చెబుతూ వస్తున్నా వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందినా కొన్ని సీట్లను సాధించగలిగింది. అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరిపోయారు. ప్రస్తుతం వలసలు కాస్త తగ్గినట్టు కనిపించినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో  చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం కాంగ్రెస్ ను మరింత కంగారు పెడుతోంది.

IHG
 

మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్యెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న శ్రీధర్ బాబు ప్రస్తుతం పెద్దపల్లి నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా శ్రీధర్ బాబు మాత్రం టిఆర్ఎస్ లోకి వెళ్ళలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆశాభావం సన్నగిల్లడంతో ఆయన అధికార పార్టీ లోకి వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: