ఈ మధ్యకాలంలో పిల్లలపై... టీవీ స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీవీలలో ప్రస్తుతం వచ్చే ప్రోగ్రాం లు... స్మార్ట్ ఫోన్ ద్వారా అయ్యో  చెడు అలవాట్లు ప్రస్తుతం చిన్న పిల్లలను చెడగొడుతున్నారు. ఇక చిన్న పిల్లలు టీవీలు స్మార్ట్ఫోన్ ల  ద్వారా ప్రభావితమై కొంతమంది నేరాలకు కూడా పాల్పడుతున్నారు ఇంకొంతమంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలు టీవీ షోల ప్రభావం ఎంతగా ఉందో చెప్పడానికి ఇక్కడ జరిగిన ఘటన ఓ నిదర్శనం అని చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు టీవీలో చూపించినట్లు  ఎన్నో సాహసాలకు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీవీలు సినిమాలు చూసి నిజజీవితంలో కూడా అలాగే చేయాలని అనుకుంటున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... పశ్చిమబెంగాల్లో టీవీ చూసిన ఓ బాలుడు ఉరి వేసుకొని చనిపోయాడు. పశ్చిమ బెంగాల్లోని దువాదిగి గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు రజినీకాంత్. ఈ బాలుడు నాలుగవ తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు ఈ బాలుడు. అయితే ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలుని సమీప ఆస్పత్రికి తరలించిన అప్పటికే సమయం చేయి దాటిపోయింది. ఆ బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. 

 

 

 అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తొమ్మిదేళ్ల రజనీకాంత్ కు  క్రైమ్ థ్రిల్లర్ అంటే ఎక్కువగా ఇష్టమని అతని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిత్యం టీవీలో అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కు సంబంధించిన నేర  సంబంధిత కార్యక్రమాలను తమ కుమారుడు చూస్తూ ఉండేవాడు అని తల్లిదండ్రులు తెలిపారు. ఇక ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా ఇలాంటి క్రైమ్ కి సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు చూసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కాగా  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: