ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.  ‘ప్రజా సంకల్ప యాత్ర’ తో ప్రస్తుత సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమం ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పెంచింది.  ఒకప్పుడు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు అయిన జగన్ సామాన్యుడిగా ప్రజల మద్యకు వచ్చి వారి కష్టాలను తెలుసుకున్నారు.  రాజు అంటే అంతపురఃంలో ఉంటూ స్వర్గ సుఖాలు అనుభవించేవాడు కాదు... ప్రజల మద్య కు వచ్చి వారి కష్టసుఖాలు తెలుసుకున్నవాడే నిజమైన పాలన చేయగలడు అన్న నగ్న సత్యాన్ని సీఎం జగన్ తూ.చ. తప్పకుండా పాటించారు.  తన తండ్రి బాటలోనే నడుస్తూ... పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందారు.  అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టిడీపి ని చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ కే పట్టం కట్టారు ఆంధ్రప్రజ. 

 

 సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి బేషాజాలకు వెళ్లకుండా ఆయన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు జగన్. నిజంగా తాము కోరుకున్న నాయకుడు వచ్చాడని.. మళ్లీ ఏపిలో రాజన్న పాలన కొనసాగుతుందని అందరూ సంతోషంలో ఉన్నారు.  అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్నవారని.. తన కంటిముందు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే స్వయంగా వెళ్లి సహాయం అందిస్తారన్న విషయం గతంలో చూశాం.  తాజాగా మరోసారి ఆయన మంచితనం ఎంతో చూపించారు.  సీఎం జగన్ కాన్వాయ్ ఏలూరు సమీపంలో వెళుతూ ఉండగా, ఓ కుటుంబం రోడ్డు పక్కన నిలబడి, కాగితాలు పట్టుకుని ఉండటాన్ని జగన్ గమనించారు.

 

వెంటనే కాన్వాయ్ ని ఆపించి, వారిని దగ్గరకు పిలిపించుకున్నారు. తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదని, తమ ఊరిలో ఉన్న చాలా కుటుంబాలకు రాలేదని, ఇటీవలి వరదల తరువాత తమకు రూ. 5 వేల సాయం కూడా అందలేదని పాత పైడిపాకకు చెందిన బొత్తా త్రిమూర్తులు ఫ్యామిలీ, తమ గోడును సీఎం వద్ద వెళ్లబోసుకుంది. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు వారికి చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: