తమ సొంత అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు కొంతమంది సెలబ్రిటీలకు లేనట్టుగా తయారయింది ప్రస్తుత వాతావరణం. ఏపీలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనపై అమరావతిలో ఒక వర్గం ప్రజలు తప్ప మిగతా అన్నిచోట్ల జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రజలు తమ మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో కొంతమంది వీఐపీలు మౌనం వహించినా మరికొంత మంది మాత్రం తమ మనసులో మాటను బయట పెట్టారు. ఆ విధంగానే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రకటన చేశారు. 

IHG


ఇక అప్పటి నుంచి టీడీపీకి కొంతమంది వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.ప్రస్తుతం విశాఖ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు దాని నుంచి కొంచెం డైవర్ట్ చేసేందుకు అన్నట్టుగాహైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద అమరావతి జేఏసీ పేరిట కొంతమంది ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఇంటి ముందు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇంటి చుట్టూ బారికేట్లు  ఏర్పాటు చేసి చిరు నివాసానికి ఎవరు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 


 అమరావతి జేఏసీ మాత్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అమరావతి జేఏసీ పేరిట కొంతమంది చిరు నివాసం వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుండగా దీనిని అడ్డుకునేందుకు చిరు అభిమానులు కూడా పెద్ద ఎత్తున చిరంజీవి నివాస పరిసర ప్రాంతాల్లో చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయో అనే టెన్షన్ నెలకొంది. ఈ సందర్భంగా చిరు అభిమానులు మాట్లాడుతూ స్వతంత్రంగా తమ భావాలను వ్యక్తం చేసుకునే హక్కు కూడా లేదా అంటూ అమరావతి జేఏసీ నాయకులు తీరుపై మండిపడుతున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న కుట్ర అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: