ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి దానికి సెలెబ్రిటీల సహకారం లభిస్తే ఎంతగా ముందుకు వెళ్తుందో చెప్పక్కర్లేదు.  గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది.  అది ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఫేమ్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  సామాన్యుల నుంచి అసామాన్యులు వరకు అందరూ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.  ఐస్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరించి అద్భుతాలు చేశారు.  కాగా, ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ దేశంలో నడుస్తున్నది.  


దేశంలోని సెలెబ్రిటీలు పచ్చని మొక్కను నాటి గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.  ఈ ఛాలెంజ్ లో భాగంగా ఇటీవలే రోజా మొక్కలు నాటింది.  మొక్కలు నాటి  మరో ముగ్గురిని నామినేట్ చేసింది.  అందులో సినిమా హీరో  అర్జున్ కూడా ఉన్నారు.  అయన కూడా ఇటీవలే మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు.  ఇలా చేయడం వలన రాష్ట్రంలో మొక్కలు పచ్చగా ఉంటాయి.  రాష్ట్రంలో పచ్చదనం తిరిగి వికసిస్తుంది.

 
రోజా మాట ప్రకారం నగరి నియోజక వర్గంలో కార్యకర్తలు సామాన్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని  చేపట్టారు.  మొక్కలు నాటుతూ అందరిని ఉత్సాహపరుస్తున్నారు.  కాగా, రోజా ఛాలెంజ్ విసిరిన వాళ్లలో అరకు ఎంపీ కూడా ఉన్నారు.  ఆమె కూడా మొక్కను నాటి దానికి సంబంధించిన ఫోటోను రోజాకు ట్యాగ్ చేసింది.  ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ లు మొక్కలు నాటారు.  


రాష్ట్రంలోని ప్రముఖులు, సామాన్యులు అందరిచేత మొక్కలు నటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రోజా భావిస్తోంది.  అందుకే రోజా చాలా చురుగ్గా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు.  రాష్ట్రం పచ్చగా ఉంటేనే అందరు పచ్చగా ఉంటారు.  స్వచ్ఛమైన గాలి ప్రజలకు లభిస్తుంది.  అందరికి ఆరోగ్యం ఉంటుంది.  చెట్లను కొట్టెయ్యడం వలన కాలుష్యం పెరుగుతుంది.  కాలుష్యంతో పాటు రోగాలు కూడా పెరిగిపోతుంటాయి.  అందుకే ఈ కార్యక్రమాన్ని రోజా ఆర్గనైజ్ చేస్తున్నారు.  రోజాతో పాటుగా నగరికి చెందిన ప్రజలు కూడా అండగా నిలవడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: