ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా దేశాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిందే. మిలిటరీ చట్టం ఆధారంగా పరిపాలించబడే 2 దేశాల్లో నియమాలు మరియు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే ఉత్తర కొరియా నాయకుడు కిమ్-జాంగ్-ఉన్ సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా దూకుడుగా వ్యవహరించే ఇతను ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించేందుకు కొరియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు.

 

IHG

అయితే ఇతను చేసే పనులు ఎంతో దుర్మార్గంగా ఉంటాయని ప్రపంచంలోని నాయకులందరూ ఆరోపిస్తూ ఉంటారు. వీలు దొరికితే అణు యుద్ధం ప్రకటించేందుకు కిమ్ ఎప్పుడూ ముందు ఉంటాడని అసలు అతని లాంటి వ్యక్తి నాయకుడు కావడం ప్రపంచానికి ప్రమాదం అని చెబుతూ ఉంటారు.

 

అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకు 56 దేశాలలో వ్యాపించిన సంగతి తెలిసిందే. తాజాగా నార్త్ కొరియా లో ఒక పౌరుడు చైనా వెళ్లి తిరిగిరాగా అతనికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకూ కొరియాలో కరోనా వైరస్ బాధితులు ఎవరూ లేకపోగా మొట్ట మొదటి వ్యక్తిని కనుగొన్నట్లు అధికారులకు సమాచారం అందజేయగా వెంటనే అతనిని కాల్చి చంపమని కిమ్ ఆర్డర్లు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే పోలీసులు అతనిపై తప్పుడు కేసులు పెట్టి అతనిని ఒక కరడుగట్టిన నేరస్థుడిగా చిత్రీకరించి వారి దగ్గరనుండి అతను పారిపోతున్నట్లు వివరించి అతనిని మట్టుబెట్టారట.

 

ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో కి కిమ్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. కిమ్ మాత్రం అతని ఒక్కడి వల్ల దేశంలో ప్రజలందరికీ ప్రమాదమని మరియు వైరస్ ధాటికి ఎన్నో ప్రాణాలు బలి అవుతాయి అని చెప్పి అతనిని చంపివేసినట్లు తెలుస్తోంది. మిగతావారు మాత్రం కరోనా వైరస్ తో పోరాడే పద్ధతి అయితే ఇది కాదని అంటున్నారు. ఇంతకీ కిమ్ చేసిన పనిని మీరు సమర్థిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: