చికెన్ షాప్ కు వెళ్లిన ఓ వ్యక్తి తనకి అప్పుగా చికెన్ ను  అందుకు అతను నిరాకరించడం తో ఆ వ్యక్తి ఎం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. అడిగినంత చికెన్ ను ఇవ్వ లేదని తప్పుడు ప్రచారం చేసి మొత్తాని కి ఎసరు పెట్టాడు.. ‘కోవిడ్‌-19’ పేరు వింటేనే ప్రపంచం వణికి పోతోంది ఇప్పుడు. చైనాలో ని వూహాన్ నుంచి బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు 50కి పైగా దేశాల్లో వ్యాపించి ప్రజల ప్రాణాలు తీస్తోంది. దాని పేరు వింటేనే దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. 

 

 

మన దేశంలోని కేరళలో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో కోళ్లకు కూడా ‘కోవిడ్‌-19’ వైరస్ సోకుతోందని, వాటి మాంసం తింటే మనుషులు చనిపోతారన్న ప్రచారం ఊపందుకుంది.దీంతో తమిళనాడులోని నైవేలి ప్రజలు చికెన్ పేరెత్తితేనే హడలిపోతున్నారు. అయితే ఈ వందతులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ విషయం బయటపడింది. 

 

 

కడలూరు జిల్లా నైవేలి ప్రాంతంలో ఫక్రుద్ధీన్‌ అనే వ్యక్తి చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆ షాపులో అమ్మే బాయిలర్ కోడి మాంసం తింటే ‘కోవిడ్-19’ వైరస్ సోకుతోందని కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే అదునుగా చూసుకున్న వ్యక్తి రెండు రోజుల్లో డబ్బులు ఇస్తానని చికెన్ ఇవ్వాలని డిమాండ్ చేసాడు. అందుకు నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. 

 

 


దాంతో కక్ష పెంచుకున్న శక్తివేల్ ఫక్రుద్దీన్ దుకాణంపై పుకార్లు సృష్టించాడు. అతడి దుకాణంలో చికెన్ తింటే వైరస్ సోకుతోందని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో శక్తివేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. అలాఅతని చికెన్ షాప్ కు గండి పడటంతో దిగులు చెందాడు. చివరికి అతన్ని కటకటాలకు పంపించాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: