ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అన్నివర్గాల్లో బాగా క్రేజ్ నాయకుడు ఎవరంటే సీఎం జగన్ మోహన్ రెడ్ది అని తడుముకోకుండా చెప్పేయొచ్చు. ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరైన జగన్...అధికారంలోకి వచ్చాక మరింత చేరువయ్యారు. జగన్ అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు.  కేవలం 9 నెలల్లోనే బోలెడు పథకాలు తీసుకొచ్చి, ప్రజలకు అండగా నిలిచారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అని చూడకుండా సంక్షేమ పథకాలు అందించారు. ఇలా పథకాలు అందించడం వల్ల ఏపీ ప్రజలు జగన్‌ని ఎక్కువగా అభిమానిస్తున్నారు.

 

అయితే ఈ మధ్య తీసుకొచ్చిన ఓ పథకంతో జగన్‌కు ఊహించని క్రేజ్ వచ్చింది. రాజకీయాలు అంటే పెద్దగా పట్టించుకొని మహిళా విద్యార్ధుల అభిమానం సంపాదించుకున్నారు. ఇటీవల జగన్ కాలేజీ విద్యార్ధులకు సాయం చేయడంలో భాగంగా ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఏటా ఐటీఐ చదువుతున్నవారికి రూ.10వేలు, డిప్లొమా చదువుతున్నవారికి రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై చదివేవారికి రూ.20 వేలు సాయం చేయనున్నారు.

 

ఇక మొదట విడతలో భాగంగా 11 లక్షల మంది విద్యార్ధుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే ఒకేసారి ఇలా సాయం చేయడం వల్ల విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతుంది. వారి చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ది పొందిన పేద విద్యార్ధులు ఆనందంతో ఉన్నారు.

 

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే....మామూలుగానే విద్యార్ధులకు రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఇక వీరిలో ఎక్కువ జగన్‌ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయాలు అంటే పెద్దగా పట్టించుకొని విద్యార్ధినిలు కూడా ఇప్పుడు జగన్‌ని అభిమానించడం మొదలుపెట్టారు. వారు సోషల్ మీడియా వేదికగా జగన్‌పై అభిమానం చాటుకుంటున్నారు. సరైన సమయంలో సాయం చేసిన జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తానికైతే కాలేజీ అమ్మాయిల్లో జగన్‌కు ఊహించని క్రేజ్ బాగా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: