ఈ మద్య ప్రపంచంలో జనాభా బాగా పెరిగిపోతుందని పిల్లల విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత దేశంలో ఒక్కరు ముద్దు... ఇద్దరు హద్దు... ఆపై వొద్దు అంటున్నారు.  కాకపోతే కొంత మంది ఆడపిల్లు పుట్టిన వారు మగ పిల్లల కోసం ఆ రూల్స్ తప్పుతున్నారు. ప్రస్తుతం కాలంలో చిన్న కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  గ్రామీణ స్థాయిలో కూడా ఇదే రూల్స్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు నూతన వధూ వరులను గంపెడు పిల్లలను కని వంశాన్ని ఉద్దరించమ్మా అంటూ దీవించేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కరూ.. ఇద్దరు చాలామ్మ అంటూ దీవిస్తున్నారు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కొంత మంది మాత్రం గంపెడు పిల్లలను కని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.  ఇది రేర్ గా జరుగుతున్న సంఘటనలు మాత్రమే. తాజాగా  బ్రిటన్‌కు చెందిన సూ రాడ్‌ఫోర్డ్   తాజాగా 22వ బిడ్డను కంటోంది. నిండు గర్భంతో సెల్ఫీ అంటూ హల్ చల్ చేస్తోంది.  విచిత్రం ఏంటంటే.. రాడ్‌ఫోర్డ్ మూడేళ్ల కిందట 21వ బిడ్డను కంటున్నప్పుడు.. తాను ఇకపై గర్భం దాల్చనని చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె మాట తప్పి 22 వ బిడ్డకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

45 ఏళ్ల రాడ్‌ఫోర్డ్ 14వ ఏట తొలి బిడ్డను కన్నది. అప్పట్నుంచి గ్యాప్ లేకుండా కంటూనే ఉంది.  11మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు..  లాంకషైర్ లోని మోర్ కాంబేలో నివసిస్తున్న ఈ కుటుంబం బ్రిటన్లో అతిపెద్ద కుటుంబం. పెద్ద కొడుకు క్రిష్ వయసు 30 ఏళ్లు.  ఇమెకు మధ్యలో ఒక నెలలు నిండని బిడ్డ పుట్టి చనిపోయాడు. 21 మంది పిల్లలతో కళకళలాడుతుంటుంది రాడ్ ఫోర్డ్‌ల కుటుంబం.  ఇంట్లో 10 బెడ్ రూములు ఉన్నాయి.  మొత్తానికి రాడ్‌ఫోర్డ్‌ల ఇల్లు ఓ చిన్న హాస్టల్లా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: