మహిళలకు ఎక్కడికి వెళ్లినా రక్షణ కరువవుతోంది. పట్టపగలు రోడ్డు మీద నడవాలి అన్న పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు మహిళలకు  రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్నా..  వారికి ఏదో విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే గత కొంత కాలం క్రితం... చైన్ స్నాచర్లు తమ ప్రతాపాన్ని చూపించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలు కనీసం బంగారు నగలు వేసుకొని బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చైన్ స్నాచర్ల పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ కాస్త తగ్గింది. ఇక తాజాగా చైన్ స్నాచింగ్ మరోసారి వెలుగులోకి వచ్చింది. 

 

 

 పట్టపగలే ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి... బైక్ పై వచ్చిన దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నడిరోడ్డు పైన పట్టపగలే చైన్ స్నాచింగ్ చేసి దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లాలోని వాణి నగర్ లో  ఘటన చోటుచేసుకుంది. వాణి నగర్ కు చెందిన బత్తుల సంధ్యారాణి కిరణా షాప్ నిర్వహిస్తుంది. అయితే సదరు మహిళ ఏదో పని నిమిత్తం షాప్ నుండి బయటకు రాగానే అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు... తన పని కానిచ్చేశారు. ముసుకు వేసుకొని బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు ఆమె మెడలోని 37 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లారు. 

 

 

 అయితే పట్టపగలే నడిరోడ్డుపై బంగారు గొలుసు దొంగలించడం పోలీసులకు సవాలుగా మారగా..  స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై వెంటనే సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించింది. ఇక సదరు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. అయితే దొంగతనం జరిగిన సంఘటన స్థలంలో ఉన్న పలు సిసి కెమెరాలో రికార్డైన దృశ్యాలను సేకరించి పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక రోడ్డుపై వెళ్లేటప్పుడు మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: