ఢిల్లీ చరిత్ర చాలా గొప్పది. అది ఎందరికో కలల రాజధాని, మరెందరికో కలవరం కలిగించే రాజధాని. చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే ఢిల్లీ రాజసం అర్ధమవుతుంది. ఇపుడు దేశ రాజకీయాలకు పుట్టినిల్లుగా మారిన ఢిల్లీ అంటే చాలా మందికి ఎందుకో పెద్ద‌ జడుపే.

నాడు ఇందిరాగాంధీ జమానాలో ఢిల్లీ అంటేనే  ఏకైక చక్రవర్తి. దేశంలో  మిగిలిన వారంతా సామంతులే. తాబేదార్లే. ఇపుడు మోడీ కూడా అదే తీరున ఢిల్లీని ఏలుతున్నారు. ఆయన కంట పడడం కొందరికి వరం, మరికొందరికి జ్వరం.

ఎన్నికలకు ముందు ఢిల్లీ కోటను బద్దలుకొడతానని వీరంగం వేసిన చంద్రబాబు ఇపుడు మాత్రం బాగా తగ్గిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే జాతీయ నాయకుడు కాస్తా అమరావతి నాయకుడుగా మిగిలిపోయారు. బాబు రాజకీయం ముందు మోడీ ఎంత అని గద్దించిన తమ్ముళ్ళ గొంతులకు కూడా ఒక్కసారిగా సౌండ్ లేకుండా పోయాయి.

 

అవును మరి ఎంత రాజకీయ చతురుడు అయినా బాబు ఒకేసారి అంతమంది శత్రువులతో యుధ్ధం చేయగలరా. ఓ వైపు ఏపీలో జగన్, పొరుగున కేసీయార్ ఉండనే ఉన్నారు. దాంతో మోడీ వైపు బాబు చూస్తున్నారు. అందుకే మోడీ ఏంచేసినా పల్లెత్తుమాట అనడంలేదు.

 

దేశంలో ఆర్ధిక మాంద్యం ఉంది. మరో వైపు సీఏఏ మీద అల్లర్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఢిల్లీలో ఏకంగా 30 మందికి పైగా అమాయకులు చనిపోయారు. అయినా బాబు కనీసం పల్లెత్తి తన అభిప్రాయం చెప్పడంలేదు. ఎక్కడ మోడీకి కోపం వస్తుందోనని బాబు లాంటి జాతీయ నాయకుడు ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

 

అందుకే వైసీపీ నేత దాడి వీరభద్రరావు లాంటి వారు బాబుని జాతీయ నాయకుడేనా అని ఎగతాళీ పట్టిస్తున్నారు. దేశంలో ఏం జరిగినా ఎందుకు నోరు మెదపడంలేదు, ఢిల్లీ అంటే అంత వణుకా అని దాడి చేస్తున్నారు. అయినా బాబు కు నో సౌండ్. అవును మరి ఎక్కడ తగ్గాలో బాబుకు బాగా తెలుసు. అందుకే ఈ మౌనవ్రతం.

మరింత సమాచారం తెలుసుకోండి: