మీడియాలో కీలక పాత్రలు అంటే ఎడిటర్లనే చెప్పాలి. కింది స్థాయి ఉద్యోగిని సబ్ ఎడిటర్ అనీ.. పై స్థాయి బాస్ ను ఎడిటర్ అని అంటారు. ఈ మధ్యలో ఎన్నో హోదాలు ఉంటాయి. అన్నింటి కంటే పెద్ద స్థానం మాత్రం ఎడిటర్. అటు పత్రికల వార్తలు ఇటు ఛానల్ కానీ.. ఈ ఎడిటర్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. మొత్తానికి మేనేజ్ మెంట్ దే కీలక నిర్ణయాలైనా రోజువారీ వ్యవహారాల్లో మాత్రం బాసులు ఈ ఎడిటర్లే.

 

 

కానీ ఇప్పుడు తెలుగు మీడియాలో బాసులకు కష్టకాలం ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా మీడియాల్లోంచి బాసులు నిష్క్రమిస్తున్నారు. ఇందుకు కారణాలు అనేకం అనే చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు ఏ బాసులకు కష్టం వచ్చిందంటారా.. దీన్ని కష్టం అని చెప్పలేం కానీ.. నిష్క్రమణ అని చెప్పుకోవచ్చు. ఈ నిష్క్రమణలు కొన్ని గౌరవంగా జరుగుతుంటే.. మరికొన్ని అవమానకరంగా ఉంటాయి. పాత్రికేయ జీవితంలో ఈ ఎత్తుపల్లాలు సహజమే అనుకోండి.

 

 

ఇంతకీ ఈ నిష్క్రమిస్తున్నారు ఎవరంటారా.. తాజాగా టీవీ 5 ఛానల్ కు ఇన్నాళ్లూ ఎడిటర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఆ ఛానల్ కు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఆయన స్థానంలో మాజీ ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, చాలారోజులుగా టీవీ5లోనే చేస్తున్న విజయ్ ను యాజమాన్యం భర్తీ చేసింది. ఇక మరో నిష్క్రమణ.. నమస్తే తెలంగాణ నుంచి ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డిని సగౌరవంగా సాగనంపారు. ఆయన్ను తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. స్థానంలోకి ఆంధ్రజ్యోతిలో చాలాకాలం పనిచేసిన తిగుళ్ల కృష్ణమూర్తిని తీసుకున్నారు.

 

 

ఇక ఇంకో నిష్క్రమణ టీ న్యూస్ నుంచి సీఈవో నారాయణరెడ్డి.. ఈయనదీ సేమ్ సీన్. ఈయన్ని కూడా సమాచారశాఖ కమిషనర్ గా నియమించారు. ఇక తెలుగు పాత్రికేయ దిగ్గజంలో దశాబ్దాల తరబడి ఎడిటర్ గా ఉన్న యజమాని రామోజీరావు ఇటీవలే ఆ పాత్ర నుంచి తప్పుకుని ఫౌండర్ గా పరిమితమైన సంగతి తెలిసిందే. మీడియాలో ఇలాంటి పరిణామాలు సహజమే అయినా.. ఒకేసారి ఇన్ని మార్పులు మాత్రం విశేషమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: