ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కలిశాడు. ఈ దేశంలోనే అత్యధిక ధనవంతుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన అంబానీ.. ఇప్పుడు స్వయంగా ఏపీ సీఎం జగన్ ను ఇంటికొచ్చి మరీ కలిశాడు. అయితే ఓ పారిశ్రామిక వేత్త ఓ సీఎంను కలవడం సాధారణంగా పెద్ద విషయం కాదు. ఇలాంటి భేటీలు చాలా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ భేటీ మాత్రం చాలా సంచలనాత్మకమైంది.

 

 

ఎందుకంటే ఇందుకు కాస్త ఫ్యాష్ బ్యాక్ కు వెళ్లాలి. జగన్ తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రమాదం కాదు.. ఓ ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ రష్యన్ బ్లాగ్ లో వచ్చిన సమాచారం అప్పట్లో విపరీతమైన సంచలనం సృష్టించింది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ఉన్నారని ఆ బ్లాస్ రాసుకొచ్చింది. దీనిపై ఓ ఛానళ్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

 

 

ఆ చర్చ తర్వాత వైసీపీ శ్రేణులు ఉమ్మడి ఏపీలోని రిలయన్స్ కంపెనీల ఆస్తులపై దాడులు కూడా చేశాయి. ఇప్పటికీ వైఎస్ మరణం ప్రమాదం కాదని..అది కచ్చితంగా హత్యేనని నమ్మే వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. వైఎస్ మరణంపై ఇన్ని కథనాలు ఉంటే.. ఇప్పుడు అదే రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ.. విజయవాడ వచ్చి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.

 

 

అంటే మరి వైఎస్‌ జగన్ రిలయన్స్ కంపెనీ పై వచ్చిన వార్తలను నమ్మలేదనుకోవాలా... తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ కంపెనీ లేదని జగన్ క్లారిటీ ఇచ్చినట్టేనా.. లేక.. వైఎస్ జగన్ క్షమించేశారా.. అన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: