రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రభావమో  లేదా సినిమాల ప్రభావమో... ఇంకేదైనా కారణాలు వెరసి ఇంకా లోకాన్ని కూడా సరిగా చూడని చిన్నారులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. అమ్మ మందలించిందనో  లేదా టీచర్ తిట్టిందని.. లేదా స్నేహితులు అనుమానించారని  ఇలా చిన్న చిన్న విషయాలకు తీవ్ర మనస్థాపం చెంది... కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాము బతకడమే వేస్ట్ అని మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న చిన్నారుల సంఖ్య ఈరోజుల్లో ఎక్కువైపోతుంది. ఇక తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

 

 

 ఇక్కడ 12 ఏళ్ల బాలుడికి వీడియో గేమ్ ఆడే అలవాటు ఉంది. రోజు వీడియో గేమ్ ఆడి ఆడి ఆ వీడియో గేమ్ కి బానిస గా మారిపోయాడు సదర్ బాలుడు. ఈ నేపథ్యంలో చదువు దూరం పెట్టేసి నిర్లక్ష్యం చేసే వాడు. పలుమార్లు తల్లిదండ్రులు చదువుకోవాలని వీడియో గేమ్ పక్కన పెట్టాలని హెచ్చరించారు. అయినప్పటికీ వినకుండా  వీడియో గేమ్ ఆడుతూ ఉండేవాడు ఆ బాలుడు. ఇదే క్రమంలో వీడియో గేమ్ ఆడనివ్వలేదు తండ్రి..దీంతో  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

 మియాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది... బాల వెంకట సత్య ప్రసాద్ అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి మియాపూర్లోని స్వప్న నిర్వాన్  అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాబ్  తో గేమ్ ఆడుకునేందుకు తండ్రి నిరాకరించాడు అన్న మనస్థాపంతో... అపార్ట్మెంట్ పైనుంచి దూకి మృతి చెందాడు ఆ బాలుడు. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో అపార్ట్మెంట్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో చిన్నారులపై సెల్ ఫోన్లు సినిమాల ప్రభావం ఎంతగా ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: