రిలయన్స్ గ్రూపు అధినేత ముకేశ్ అంబానీకి టీడీపీకి సన్నిహత సంబంధాలు ఉన్నాయని అంటారు. గతంలో ఈనాడు దిన పత్రిక యజమాని రామోజీరావు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన టీవీ ఛానళ్లను కొని రిలయన్స్ సంస్థ ఆదుకుంది. ఈ డీల్ కుదరడంలో చంద్రబాబు సాయం చేశాడని అంటారు. అంతేకాదు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. రిలయన్స్ కంపెనీ అధినేత విజయవాడ వచ్చి ఆయన్ని కలిశారు. తిరుపతిలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు.

 

 

అలా మొత్తానికి ముకేశ్ అంబానీ అంటే.. చంద్రబాబు అండ్ కోకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. ఇప్పుడు అలాంటి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా విజయవాడ వచ్చి సీఎం జగన్ ను కలిశారు. ఈ భేటీ వెనుక కారణాలను రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ఇది టీడీపీ గ్యాంగ్ కు ఊహించని పరిణామమే.

 

 

ఈ పరిణామం ప్రభావం ఎలా ఉంటుందోనన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. రిలయన్స్ అంబానీతో దోస్తీ ద్వారా.. చంద్రబాబు తాలూకు మరో బలమైన ఆర్థిక స్థంభాన్ని మంచితనంతో జగన్ తనవైపు తిప్పుకుంటున్నాడా అన్న చర్చ కూడా సాగుతోంది. అందులోనూ గతంలో రిలయన్స్ సంస్థ జగన్ తండ్రి వైఎస్ఆర్ ను చంపించిందన్న అపవాదులు ఉండనే ఉన్నాయి. దీనిపై గతంలో చాలా చర్చ జరిగింది కూడా..

 

 

మరి ఎవరినీ అంత తేలిగ్గా వదలే మనస్తత్వం లేని జగన్... చంద్రబాబు మనిషిగా పేరుబడిన ముఖేష్ అంబానీని ఎందుకు కలిసేందుకు అంగీకరించినట్టు.. దీని వెనుక ఎలాంటి రాజకీయం ఉండబోతోందన్న ఆలోచన అటు టీడీపీ వర్గాలనూ నిద్రపోనీయడం లేదు. ఏదోలా నరేంద్రమోడీ పంచన మరోసారి చేరదామని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను జగన్ ఈ రకంగా అడ్డుపడుతున్నాడా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా జగన్ ముఖేష్ అంబానీల భేటీ అటు టీడీపీ గుండెల్లో బాంబులు పేలుస్తోందంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: