రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబింపజేస్తోందంటారు. సాధారణంగా ఈ బడ్జెట్ పరిమాణం ఏటి కేడు పెరుగుతుంటుంది. ఒకప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవడమే ఉమ్మడి ఏపీలో ఓ సంచలనంగా ఉండేది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో

రూ.2,27,974.99 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రతిపాదించారు.

 

 

కానీ ఈసారి మాత్రం బడ్జెట్ పరిమాణం రూ. 2 లక్షల కోట్ల లోపే ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఎందుకు ఇలా తగ్గింది.. ఇందులో జగన్ సర్కారు వైఫల్యంగా చెప్పుకోవాలా.. లేక జగన్ సర్కారు వ్యూహమా.. ఈ విషయాన్ని అంచనా వేసే ముందు బడ్జెట్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. బడ్జెట్ లో చెప్పినవన్నీ జరగవన్న విషయం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ లో చూపేవన్న అంచనాలు మాత్రమే. ఊహాజనితమైన లెక్కలే.

 

 

గత ఏడాది రూ.2,27,974.99 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కానీ వాస్తవానికి రూ.1.60 లక్షల కోట్లే ఖర్చుచేశారు. అందుకు కారణం.. బడాయి చెప్పుకోవాలన్న అప్పటి సర్కారు ఉద్దేశ్యం.. ఆశించిన స్థాయిలో ఆదాయాలు రాకపోవడం, కేంద్రం నుంచి వస్తాయనుకున్న నిధులు అందకపోవడంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు మాత్రం వాస్తవికమైన బడ్జెట్ మాత్రమే ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.

 

 

ఏదో జరిగిపోతోందన్న బిల్డప్ ఇచ్చి చతికల పడటం కన్నా.. వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచి.. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఈ ఏడాది బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లలోపే ఉండే అవకాశం ఉంది. రూ.1.80 - రూ.1.90 లక్షల కోట్ల మధ్య ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నది విశ్లేషకుల మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: