ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో  పెద్ద దుమారమే రేగుతోందన్న  విషయం తెలిసిందే. ఇప్పటికీ అమరావతి పరిరక్షణ సమితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పోరాటం చేస్తూనే ఉంది. ఇక అమరావతి లో కూడా రైతులు అమరావతి నుంచి రాజధాని తరలించడానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమరావతి రైతులు చేపడుతున్న నిరసనలు 70 రోజులకు పైగానే కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వంగవీటి జగన్ సర్కార్ పై పలు విమర్శలు గుప్పించారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ వంగవీటి డిమాండ్ చేస్తూ అమరావతి రైతులకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఉన్న తేడా ఏంటో వంగవీటి తెలిపారు. రైతేరాజు అని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే జగన్ మాత్రం రైతులను అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.

 

 

 

 ఇప్పటికే 74 నాలుగు రోజులకు పైగా అమరావతి రైతుల ఉద్యమం చేస్తున్నప్పుడు కనీసం రైతుల ఉద్యమం పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అంటూ మండిపడ్డారు. అప్పట్లో హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టి చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరెడ్డి హైటెక్ సిటీని మరింత అభివృద్ధి చేశారు అంటూ గుర్తు చేసిన వంగవీటి... కానీ ప్రస్తుతం జగన్ మాత్రం చంద్రబాబు చేసిన అన్నింటినీ రద్దు చేస్తూ తరలిస్తున్నారు అంటూ ఆరోపించారు. అయితే ఎన్నికల ముందు వరకు వైసీపీ పార్టీలో కొనసాగిన వంగవీటి రాధా ఆ తర్వాత టిడిపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుత టిడిపిలో ఉంటూ వైసీపీ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ,

మరింత సమాచారం తెలుసుకోండి: